ఎన్నికల ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ కావడంతో వివిధ ప్రైవేట్ సర్వే సంస్థలు, మీడియా ఛానెళ్లు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. ఓటర్లు ఎవరికీ పట్టం కట్టారో అంచనాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో ఏ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకుంటుందో ప్రముఖ ప్రైవేట్ టీవీ చానల్స్ స్ట్రాట్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు దక్కించుకుంటుందని అంచనా వేయగా..బీజేపీ 7 చోట్ల విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. . ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితం అవుతోందని వెల్లడించింది. ఎంఐఎం తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందని తెలిపింది.
ఇదిలా ఉంటే ఆరా సంస్థ సైతం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించింది. బీజేపీ 8-9 సీట్లు, కాంగ్రెస్ 7-8, ఎంఐఎం 1, బీఆర్ఎస్‌కు ఒక్క ఎంపీ సీటు కూడా అంచనా వేసింది.