తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ వేసేందుకు ఆర్వో కార్యాలయానికి వెళ్లి క్యూలో వున్న అభ్యర్ధులకు అధికారులు అవకాశం కల్పించారు. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల నుంచి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. సమయం మించి పోవడంతో కొందరు అభ్యర్ధులు పరుగులు తీశారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన, 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం గడువు విధించింది. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు విడుదల కానున్నాయి.
నేడు వెయ్యికి పైగా నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం గురువారం ఒక్కరోజే 1133 నామినేషన్లు దాఖలు కాగా.. నిన్నటి వరకు 2478 నామినేషన్లు దాఖలయ్యాయి. .. ఇప్పటికే . తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా హేమాహేమీలు నామినేషన్లు వేశారు. రేవంత్ రెడ్డి కామారెడ్డి, కొడంగల్ లోనూ , ఈటల హుజూరాబాద్, గజ్వల్ లోనూ, కెసిఆర్ గజ్వేల్, కామారెడ్డిలలోనూ నామినేషన్స్ దాఖలు చేశారు..