Monday, January 20, 2025

Telanganaలో అప్రకటిత ఎమర్జెన్సీ – మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

న‌ల్ల‌గొండ‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని మాజీమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు కేటీఆర్ పాల్గొనే రైతు మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడం పై ఆయన తీవ్రస్థాయిలో మండిప‌డ్డారు. కేటీఆర్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి కి వణుకు పుడుతుందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై పోరాటం చేయడం రాజకీయ పార్టీల హ‌క్కు అని చెప్పారు. రైతులను మోసం చేసినందుకు బీ ఆర్ఎస్ ఏ కార్యక్రమం చేపడుతున్నా ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుంటుందని ఆరోపించారు.

ఎన్ని ఆటంకాలు ఎదురైనా…
ఎన్ని ఆటంకాలు ఎదురైనా నల్లగొండ పట్టణంలో రైతు మహాధర్మాను నిర్వహిస్తామని ఈ కార్యక్రమానికి కేటీఆర్ తప్పక హాజరవుతారని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. పరిపాలన చేతకాక సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నార‌ని ఆరోపించారు. రైతు సమస్యల పరిష్కారం కోసమే తాము రైతు మహా ధర్నాను నిర్వహిస్తున్నామని చెప్పారు. కేటీఆర్ ఎక్కడికి వెళ్లినా శాంతియుతంగా పోరాటం చేస్తున్నాడని చెప్పారు. కృష్ణా, గోదావరి నీళ్లను సక్రమంగా వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రుణమాఫీని రైతులకు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జగదీశ్ రెడ్డి విమర్శించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement