హైదరాబాద్ – తెలంగాణాలోని 119 నియోజకవర్గాలకు మొత్తం 4,798 నామినేషన్లు దాఖలయ్యాయి. స్క్రూట్నీ అనంతరం ఏకంగా 1900 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. నామినేషన్ల స్క్రూట్నీ తర్వాత 2,898 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.. నామినేషన్ల పరిశీలన అనంతరం అత్యధికంగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ బరిలో 114 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యల్పంగా నారాయణపేటలో ఏడుగురు మిగిలారు.
మేడ్చల్ 67, కామారెడ్డి 58, ఎల్బీనగర్ 57, మునుగోడు 50, కొడంగల్ సెగ్మెంట్ నుండి 15 మంది క్యాండిడేట్లు ఎన్నికల బరిలో ఉన్నారు.కాగా, నామినేషన్ల ఉపసంహరణకు రేపు ఆఖరి రోజు. నామినేషన్ల విత్ డ్రాకు రేపు ఒక్క రోజే గడువు ఉండటంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు రెబల్స్‌ను బుజ్జగిస్తున్నాయి. ఫైనల్ గా ఎంతమంది పోటీలో ఉన్నారనే విషయం తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.