హైదరాబాద్: రాష్ట్రంలో బీఆర్‌ఎస్ , కాంగ్రెస్ మధ్యే పోటీ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఏ సెక్యులర్ పార్టీతోనైనా జతకట్టడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో రాజకీయ పరిణామాలు మారాయని పేర్కొన్నారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోడీ , అమిత్ షాలు నాయకత్వంవహించినా బీజేపీ ఓటమి చవిచూసిందని వెల్లడించారు.
కర్ణాటక ఫలితాలతో దక్షిణాదిలో బీజేపీకి గేట్లు మూసుకుపోయాయని చెప్పారు. అలాగే తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టి పాగా వేయాలని చూస్తున్న బిజెపిని ఆదరించే పరిస్థితి లేదని తేల్చేశారు.. మతం,ముస్లిం, జిహాద్, రజాక్ అంటూ ఐక్యంగా ఉన్న సమాజంలో బిజెపి విష బీజాలు నాటుతుందని మండిపడ్డారు. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయంమై ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే జాతీయ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రాజకీయ పక్షాలు మోడీకి అనుకూలంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాయని, కర్ణాటక తీర్పుతోనైనా ఆయా పార్టీల్లో మార్పు రావాలి సూచించారు. కన్నడనాట 212 నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులు కాంగ్రెస్‌కు మద్దతిచ్చారని తెలిపారు.