Monday, November 25, 2024

Telangana – నేడే బడ్జెట్ – అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నేడు బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను రేవంత్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది.పార్లమెంటు ఎన్నికల సమీపిస్తున్న వేళ రేవంత్ సర్కార్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలల కాలానికి సంబంధించి కేటాయింపులే బడ్జెట్ లో ఉన్నా ఏడాది మొత్తానికి అంచనాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సారి సుమారు రూ.2.72 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించవచ్చని సమాచారం.

.తొలుత శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో అసెంబ్లీ ఆవరణలో జరుగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్‌ అంశాలను చదివి వినిపిస్తారు.ఈ బడ్జెట్ పై సోమవారం నాడు అసెంబ్లీ, శాసన మండలిలో వేర్వేరుగా చర్చ జరుగనున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement