Wednesday, November 20, 2024

Telangana – డీఎస్సీ పరీక్షలు ప్రారంభం

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభ మయ్యాయి. తొలి రోజైన నేడు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, సోషల్ టీచర్స్‌కు పరీక్షలు జరుగుతున్నాయి. రోజుకు రెండు పరీక్షల చొప్పున ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, సాయంత్రం 2 గంటల నుండి 4.30 వరకు పరీక్షలు ఉంటాయి.

కాగా, సమయం అయిపోయాక వచ్చిన అభ్యర్థులను సిబ్బంది అనుమతించలేదు. మౌలాలిలోని ఐఓఎన్ సెంటర్ వద్ద నలుగురు డీఎస్సీ అభ్యర్థులు ఆలస్యంగా రాగా వారిని పరీక్షకు అనుమతించలేదు.

- Advertisement -

ఇక, మొత్తం 11,062 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 2,79,956గా ఉంది. .14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఈ పరీక్షలను మొదటిసారి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. పరీక్ష రాసే ప్రతి అభ్యర్థి బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. పరీక్షకు 15 నిమిషాల ముందేగేట్లను మూసేస్తారు. గంటన్నర ముందు నుంచే సెంటర్లోకి అనుమతి ఇచ్చారు. వచ్చే నెల 5వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement