Monday, November 11, 2024

Telangana – ఎన్ఐసీ చేతికి ధ‌ర‌ణి పోర్ట‌ల్‌

ప్రైవేటు సంస్థ‌కు మంగ‌ళం
కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌కు బాధ్య‌త‌లు
ఐఏఎస్ అధికారుల క‌మిటీ రిపోర్టు
సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
పోర్టల్​ నిర్వహణ బాధ్య‌త‌ల అప్పంగిత‌
ఉత్త‌ర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం
మూడేండ్ల పాటు నిర్వ‌హ‌ణ చూసేలా ఒప్పందం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌: ధరణి పోర్టల్‌లోని భూముల రికార్డుల నిర్వహణ బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీ నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్స్‌ సెంటర్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల వరకు బాధ్యతలు పర్యవేక్షించిన ప్రైవేటు కంపెనీ క్వాంటెలాను ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంతోనే ఈ సంస్థ నిర్వహణ గడువు ముగిసినప్పటికీ తాత్కాలిక నిర్వహణ బాధ్యతలను రెవెన్యూ శాఖ పొడిగిస్తూ వచ్చింది.

- Advertisement -

క‌మిటీ రిపోర్టు ఆధారంగానే..

రేవంత్ రెడ్డి సీఎం కాగానే ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్ట‌ల్, టీజీటీఎస్‌ ఎండీతో పాటు పలువురు ఐఏఎస్‌లతో కూడిన ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ధరణి నిర్వహణను ఎన్‌ఐసీ, టీజీటీఎస్, సీజీసీ సంస్థలకు అప్పగించే విషయమై అధ్యయనం చేసిన ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పోర్టల్‌ నిర్వహణను తక్కువ వ్యయంతోనే చేపట్టడానికి ఎన్‌ఐసీ ముందుకు రావడంతో చివరికి దానివైపే మొగ్గు చూపినట్లు సమాచారం. మూడేళ్లు ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను ఎన్ఐసీ చూడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement