Thursday, November 21, 2024

రాజుది ఆత్మహత్యే.. అనుమానాలొద్దు: డీజీపీ

సైదాబాద్ హత్యాచారం కేసు నిందితుడు రాజుది ఆత్మహత్యేనని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రాజు ఆత్మహత్య విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదన్నారు. నిందితుడు రాజును పోలీసులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిణలపై డీజీపీ స్పందించారు. రాజు ఆత్మహత్యపై అనుమానాలొద్దని, ఆత్మహత్య చేసుకుంటుండగా ఏడుగురు ప్రత్యక్ష సాక్షులు చూశారని తెలిపారు. ఇందులో ఇద్దరు కోణార్క్ రైలు లోకో పెలట్లు, ఒక గాంగ్ మెన్, నలుగురు రైతులు ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని చెప్పారు. వారి స్టేట్​మెంట్లను వీడియో రికార్డు చేసినట్లు చెప్పారు. రాజు రైలు కింద పడటం చూసిన లోకో పైలట్లు సంబంధిత అధికారులకు తెలియజేశారని తెలిపారు. రాజు ఆత్మహత్యకు ముందు ట్రాక్​పై తిరగడం గాంగ్ మెన్ చూశాడని చెప్పారు. రాజు ఆత్మహత్య చేసుకోవడానికి రైలు కింద పడటం అక్కడే పంట పొలాల్లో పనిచేస్తున్న రైతులు కూడా చూశారని వివరించారు. నిందితుడు రాజు ఆత్మహత్యపై అనవసర రాద్ధాంతాలు వద్దని డీజీపీ సూచించారు. ఈ విషయంపై ఎవరైన ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ఊరుకోబోమని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. 

ఇది కూడా చదవండి: Saidabad Rape case : నిందితుడు రాజు మృతిపై హైకోర్టులో పిల్

Advertisement

తాజా వార్తలు

Advertisement