Friday, November 22, 2024

కృష్ణా జ‌లాల్లో 50 శాతం వాటాకు తెలంగాణ పట్టు

కృష్ణా జ‌లాల్లో 50 శాతం వాటా కోరుతున్నామని తెలంగాణ సాగునీటిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ అన్నారు. సోమాజిగూడ‌లోని జ‌ల‌సౌధ కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు(కేఆర్ఎంబీ) స‌మావేశం అయింది. కేఆర్ఎంబీ చైర్మ‌న్ ఎంపీ సింగ్ అధ్య‌క్ష‌త‌న జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన నీటిపారుద‌ల శాఖ అధికారులు హాజ‌ర‌య్యారు. సమావేశానికి ముందుకు రజత్ కుమార్ మీడియాతో మాట్లాడారు.కేఆర్​ఎంబీ సమావేశంలో నేడు ఉపసంఘం నివేదికపై మాత్రమే చర్చ ఉంటుందని రజత్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి సమావేశం తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. బోర్డు పరిధిలోకి ఏ ప్రాజెక్టులు ఇవ్వాలనే అంశంపై సమావేశంలో చర్చిస్తామన్నారు.

కృష్ణా జ‌లాల విష‌యంలో తెలంగాణ‌కు వాటా పెర‌గాలని అన్నారు. న‌దీ ప‌రివాహ‌క ప్రాంతం తెలంగాణ‌లో అధికంగా ఉందని తెలిపారు. నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగ‌ర్, క‌ల్వ‌కుర్తి ప్రాజెక్టుకు నిక‌ర జ‌లాలు కేటాయించాలని చెప్పారు. వాటా ప్ర‌కారం తెలంగాణ‌కు 570 టీఎంసీలు కేటాయించాలన్న రజత్ కుమార్.. కొత్త ట్రిబ్యున‌ల్ వ‌చ్చే వ‌ర‌కు మ‌రో 105 టీఎంసీలు ఇవ్వాల‌న్నారు. బోర్డు ప‌రిధిలో విద్యుత్ ప్రాజెక్టులూ ఉండాల‌ని కోరుతున్నారని, తెలంగాణ‌లో అనేక ఎత్తిపోత‌ల ప‌థ‌కాలు ఉన్నాయని తెలిపారు. నీటి వాటాతో పాటు విద్యుత్ ఉత్ప‌త్తి కూడా త‌మ‌కు ముఖ్య‌మని రజత్ కుమార్ చెప్పారు. ఎత్తిపోత‌ల ప‌థ‌కాలు, బోరుబావుల‌కు విద్యుత్ ఉత్ప‌త్తి చేయాలని డిమాండ్ చేశారు.  విద్యుత్ ఉత్పత్తికి ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలుగా నిర్ణయించి.. అందుకు అనుగుణంగా చేస్తే బాగుంటుందని రజత్ కుమార్ అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: పిల్లలకు కొవాగ్జిన్ టీకా.. అత్యవసర వినియోగానికి అనుమతి?

Advertisement

తాజా వార్తలు

Advertisement