Friday, November 22, 2024

TS | దేశ‌, విదేశాల్లో తెలంగాణ సంస్కృతికి పెద్ద‌పీట‌.. జాగృతి సేవ‌ల‌తోనే ఈ ఘ‌న‌త: నీలం మ‌ధు

ఉమ్మడి మెదక్​ బ్యూరో, (ప్రభ న్యూస్​): మ‌న‌ సంస్కృతి సంప్రదాయాలను దేశ‌, విదేశాల్లో కొనియాడేలా చేసిన ఘ‌న‌త జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు మాత్ర‌మే ద‌క్కుతుంద‌న్నారు బీఆర్ ఎస్ రాష్ట్ర నేత నీలం మ‌ధు ముదిరాజ్‌. జాగృతి పేరుతో ప్రజలను ఏకంచేశార‌ని, అందుకే దేశ‌, విదేశాల్లో జాగృతికి ప్ర‌త్యేక స్థానం ఉంద‌న్నారు. హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఇవ్వాల (గురువారం) ఆయ‌న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా పుష్పగుచ్ఛం. శృంగేరి శారదాదేవి ప్రతిమ అంద‌జేశారు.

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయలకు రాష్ట్రంలోనేకాకుండా, దేశ‌, విదేశాల్లో పెద్దపేట వేసేలా చేశారన్నారు. బతుకమ్మ ఉత్సవాలు దేశ విదేశాల్లో సైతం సంబురంగా జ‌రుగుతున్నాయంటే అది జాగృతి అధినేత్రి కవిత చేసిన కృషి మాత్ర‌మే అన్నారు. మ‌న ఆచార సాంప్రదాయాలను గౌరవించుకునే విధంగా క‌విత‌ వెంట నడవాల్సిన అవసరం ఉంద‌ని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement