Saturday, November 23, 2024

రాష్ట్రంలో క‌రోనా అదుపులోకి వ‌స్తున్న‌ది – సిఎస్ సోమేష్ కుమార్…

హైద‌రాబాద్ – తెలంగాణ‌లో క్రమ‌క్ర‌మంగా క‌రోనా అదుపులోకి వ‌స్తున్న‌ద‌ని, ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని భరోసా ఇచ్చారు రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్… స‌చివాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఇత‌ర రాష్ట్రాల‌తో పొలిస్తే ప‌రిస్థితి చాలా మెరుగ్గా ఉంద‌ని పేర్కొన్నారు.. హాస్ప‌ట‌ల్స్ లో మందులు, ఎక్విప్ మెంట్ కొర‌త లేద‌న్నారు.. ఇప్ప‌టికే 53వేల అక్సిజ‌న్ బెడ్స్ అందుబాటులోకి తెచ్చామ‌న్నారు.. ఆక్సిజ‌న్ కొర‌త లేకుండా నిరంత‌రం ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్నామ‌న్నారు. హెల్త్ ఇన్ ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ ను గ‌ణ‌నీయంగా పెంచామ‌ని, అలాగే మెడిక‌ల్ సిబ్బందిని అవ‌స‌ర‌మైన మేర‌కు రిక్రూట్ మెంట్ చేసుకునే అధికారం ఆయా జిల్లా క‌లెక్ట‌ర్ ల‌కు ఇచ్చామ‌న్నారు.. కొవిడ టెస్ట్ ల‌ను అన్ని జిల్లా, ప్రాథమిక కేంద్రాల‌లో చేస్తున్నామ‌న్నారు.. వ్యాక్సినేష‌న్ ను క్ర‌మ‌ప‌ద్ద‌తిలో వేసేందుకు ప్ర‌ణళిక ప్ర‌కారం ముందుకు సాగుతున్నామ‌న్నారు… వ్యాక్సినేష‌న్ సంస్థ‌లు అందించే వ్యాక్సినేష‌న్ డోస్ ల ఆధారంగా ముందుకు వెళుతున్నామ‌న్నారు. . కేంద్ర కేటాయించిన 431 ట‌న్నుల ఆక్సిజ‌న్ తో పాటు ఇత‌ర ప్రాంతాల నుంచి కూడా అక్సిజన్ ను తెప్పించుకుంటున్నామ‌న్నారు.. ప్ర‌భుత్వ హాస్ప‌ట‌ల్లో ఆక్సిజ‌న్ కొర‌త లేకుండా చూసేందుకు ప్ర‌త్యేక యంత్రాగాన్ని ఏర్పాటు చేశామ‌న్నారు.. ముఖ్య‌మంత్రి కెసిఆర్ నిరంత‌ర క‌రోనా ప‌రిస్థితిపై ఆయా శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ ఆదేశాలిస్తున్నార‌ని చెప్పారు.. క‌రోనా నియంత్ర‌ణ ఎన్ని కోట్లు ఖ‌ర్చుకైన వెన‌కాడ‌వ‌ద్ద‌ని కెసిఆర్ స్ప‌ష్టమైన ఆదేశాలు త‌మ‌కు ఇచ్చార‌ని చెప్పారు.. అన్నింటికంటే ప్ర‌జ‌ల ప్రాణాలే ముఖ్య‌మ‌ని, వాటిని కాపాడేందుకు ఎంతైన ఖ‌ర్చు చేయ‌మ‌ని కెసిఆర్ చెప్పార‌న్నారు… హైద‌రాబాద్ మెడిక‌ల్ హ‌బ్ కావ‌డంతో ఇత‌ర రాష్ట్రాల‌తో పాటు ఇత‌ర దేశ‌స్థుల సైతం చికిత్స కోసం వ‌స్తున్నార‌ని వివ‌రించారు…ప్ర‌స్తుతం ప్ర‌తి రోజు 33 ఎయిర్ అంబులెన్స్ లో హైద‌రాబాద్ లో ల్యాండ్ అవుతున్నాయ‌న్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement