Thursday, November 21, 2024

Telangana – టెన్ష‌న్ టెన్ష‌న్‌…ఓట్ల లెక్కింపు ప్రారంభం


17 లోక్‌స‌భ సీట్లు… 34 కౌంటింగ్‌ కేంద్రాలు
139 హాల్స్‌, 2131 టేబుల్స్‌, 24 రౌండ్లు
ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు సరాసరిగా 14 టేబుల్స్‌
భారీ భద్రత మధ్య ఈవీఎంల తరలింపు
ప్రతి చర్యలోనూ సీసీ టీవీ కెమెరాల నిఘా
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌
49 మంది అబ్జర్వర్లు, 2440 మైక్రో అబ్జర్వర్లు
కౌంటింగ్‌ కోసం విస్తృత ఏర్పాట్లు చేసిన ఈసీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో:

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం అయ్యింది. 17 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపును పకడ్బందీగా చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రదేశాల్లో కౌటింగ్‌ కేంద్రాల వద్ద 139 హాళ్లలో అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 2131 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగియనుంది. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి కార్యాలయం తెలిపిన సమాచారం మేరకు తెలంగాణలో 49మంది అబ్జర్వర్లు, 2440 మైక్రో అబ్జర్వర్లను నియమించారు. వీళ్లకు అన్ని కోణాల్లో సహాయపడేందుకు 10వేల మంది సిబ్బందిని ఈసీ నియమించింది. వీళ్లతోపాటు మరికొందరిని అదనంగా నియమించారు. అవసరమైనప్పుడు వారి సేవలను కూడా వినియోగించుకుంటారు.

ఆర్మూర్‌, అశ్వారావుపేట‌, భ‌ద్రాచలంలో తొలి ఫ‌లితం..

- Advertisement -

తెలంగాణలో కొన్ని చోట్ల తక్కువ రౌండ్లలో కూడా కౌంటింగ్‌ పూర్తి కానుంది. చొప్పదండి, దేవరకొండ, యాకుత్‌పురలలో ఎక్కువ రౌండ్లు ఉన్నాయి. అక్కడ 24 రౌండ్లలో కౌంటింగ్‌ జరగనుంది. అతి తక్కువ ఆర్మూర్‌, అశ్వరావుపేట, భద్రాచలంలో ఉన్నాయి. ఈ కేంద్రాల్లో కేవలం 13 రౌండ్లలోనే కౌంటిగ్‌ పూర్తికానుంది. ఈసారి తెలంగాణలో దాదాపు మూడు లక్షల వరకు పోస్టల్‌ బ్యాలెట్లు- వచ్చాయి. చేవెళ్ల, మల్కాజ్‌గిరిలో వీటిని లెక్కిస్తారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భద్రత విషయంలో ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రతి కేంద్రంలో సీసీకెమెరాలతో నిఘా పెట్టింది. స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి కౌంటింగ్‌ సెంటర్‌ వరకు ఈవీఎంలు తరలించేటప్పుడు కూడా సీసీటీ-వీ మానిటరింగ్‌ ఉంటు-ంది. దీంతోపాటు- 12 బృందాల కేంద్ర బలగాలతో సెక్యూరిటీ ఏర్పాటు చేసింది.

24 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్‌..

హైదరాబాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఆ మేరకు రిటర్నింగ్‌ అధికారులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు, అన్ని జిల్లాల్లో ఎస్పీలు ఆదేశాలు జారీ చేశారు. జూన్‌ 4 మంగళవారం ఉదయం 6 గంటల నుంచి జూన్‌ 5 బుధవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్‌లు, రెస్టారెంట్‌లు మూసివేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. అలాగే ఈ సమయంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటు-ందని ప్రకటించారు. ఎవరైన అక్రమంగా మద్యం నిల్వ చేసి అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రాష్ట్రమంతా అలర్ట్‌.. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించడంతో పాటు- భద్రతను కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడడం, సమావేశాలు, ర్యాలీలపై కూడా జూన్‌ 5 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా, సురక్షితంగా జరిగేలా చూడడానికి కట్టు-దిట్టమైన ఏర్పాట్లు- చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంతర సంఘటనలు జరగకుండా నిరోధించడానికి భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. రాష్ట్ర రాజధానిలోని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 19 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు- చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి ఎన్నికల సంఘం జారీ చేసిన పాసులు ఉన్న సిబ్బంది, ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థుల ఏజెంట్లు, మీడియా ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఉంటుంది.

తెలంగాణ బ‌రిలో.. అభ్యర్థులు వీరే

నియోజకవర్గం కాంగ్రెస్‌ బీజేపీ బీఆర్‌ఎస్‌
ఆదిలాబాద్‌ ఆత్రం సుగుణ గడ్డెం నగేష్‌ ఆత్రం సక్కు
పెద్దపల్లి గడ్డం వంశీకృష్ణ మాసగోని శ్రీనివాస్‌కొప్పుల ఈశ్వర్‌
కరీంనగర్‌ వెలిచాల రాజేశ్వరరావు బండి సంజయ్‌ జి.వినోద్‌ కుమార్‌
నిజామాబాద్‌ టి.జీవన్‌ రెడ్డి ధర్మపురి అరవింద్‌బాజిరెడ్డి గోవర్దన్‌
జహీరాబాద్‌ సురేష్‌కుమార్‌ షెట్కార్‌ బీబీ పాటిల్‌ గాలి అనిల్‌ కుమార్‌
మెదక్‌ నీలంమధు ముదిరాజ్‌ రఘునందన్‌ రావువెంకట్రామిరెడ్డి
మల్కాజిగిరి సునీతా మహేందర్‌రెడ్డి ఈటల రాజేందర్‌రాగిడి లక్ష్మారెడ్డి
సికింద్రాబాద్‌ దానం నాగేందర్‌ జి.కిషన్‌ రెడ్డి పద్మారావు గౌడ్‌
హైదరాబాద్‌ ఎండీ వలీవుల్లా సమీర్‌ మాధవీలత గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ (ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా అసదుద్దీన్‌ ఓవైసీ)
చేవెళ్ల గడ్డం రంజిత్‌ రెడ్డి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాసాని జ్ఞానేశ్వర్‌
మహబూబ్‌నగర్‌ చల్లా వంశీచంద్‌ రెడ్డి డీకే అరుణ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి
నాగర్‌ కర్నూలు మల్లురవి భరత్‌ ప్రసాద్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌
నల్గొండ రఘువీర్‌ రెడ్డి శానంపుడిసైదిరెడ్డి కంచర్ల కృష్ణారెడ్డి
భవనగిరి చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి బూర నర్సయ్య గౌడ్‌ క్యామ మల్లేష్‌
వరంగల్‌ కడియం కావ్య ఆరూరి రమేష్‌ మారేపల్లి సుధీర్‌ కుమార్‌
మహబూబాబాద్‌ బలరాం నాయక్‌ సీతారాంనాయక్‌ మాలోత్‌ కవిత
ఖమ్మం ఆర్‌ రఘురామ్‌ రెడ్డి వినోద్‌రావు నామా నాగేశ్వరరావు


ఓట్ల లెక్కింపు జరుగుతుందిలా..

ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ప్రత్యేకంగా టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించి సరాసరిగా 14 టేబుల్స్ ఉన్నాయి. అవసరం మేరకు ఆర్‌వోలు పెంచుకునే వీలుంటుంది. ఒక్కో టేబుల్‌ మీద ఒక్కో ఈవీఎం ఉంచి ఓట్లను లెక్కిస్తారు. అలా 14 ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వెల్లడించే ఫలితాన్ని ఒక రౌండ్‌ రిజల్ట్‌ అంటారు. ఆయా నియోజకవర్గాల్లో నమోదైన ఓట్ల సంఖ్యను బట్టి రౌండ్ల సంఖ్య ఆధారపడి ఉంటుంది. ఓట్ల లెక్కింపుకు ముందు ఈవీఎంలను ఓపెన్‌ చేస్తారు. ఈవీఎం యంత్రంలోని రిజల్ట్‌ విభాగానికి ఒక సీల్‌ ఉంటుంది. ముందు దాన్ని తొలగిస్తారు. ఈవీఎం బయట కప్పును మాత్రమే ఓపెన్‌ చేస్తారు. లోపలి భాగాన్ని తెరవరు. ఆ తర్వాత ఈవీఎం పవర్‌ ఆన్‌ చేస్తారు. దానికి లోపల మరో సీల్‌ ఉంటుంది. దాన్ని తొలగిస్తే రిజల్ట్స్‌ బటన్‌ కనిపిస్తుంది. దాన్ని నొక్కితే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయో స్క్రీన్‌ మీద కనిపిస్తుంది. ఈ వివరాలను అధికారులు జాగ్రత్తగా నోట్‌ చేసుకుంటారు. అయితే కౌంటింగ్‌లో ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు. వీటికోసం కౌంటింగ్‌ కేంద్రంలో ప్రత్యేక టేబుల్‌ ఏర్పాటు చేస్తారు. పోస్టల్‌ ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కౌంటింగ్‌ ఏజెంట్లు-, అభ్యర్థుల సమక్షంలో ఓట్ల లెక్కింపు చేపడతారు. ఫలితాన్ని ప్రకటించేవరకు బాధ్యత మొత్తం రిటర్నింగ్‌ ఆఫీసర్‌ పైనే ఉంటు-ంది. ఇక ఈవీఎంలను ఓపెన్‌ చేస్తున్నప్పుడు, దాని సీల్‌ సరిగా ఉందా లేదా అనేది అన్ని పార్టీల ఏజెంట్లకు చూపిస్తారు. అది సరిగా ఉందని వాళ్లు నిర్ధారించుకున్న తర్వాతే ఈవీఎంలను ఓపెన్‌ చేసి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇక కౌంటింగ్‌ సమయంలో ఈవీఎంలు మొరాయించినట్లయితే, వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కిస్తారు. ఒక్కో వీవీ ప్యాట్‌లోని స్లిప్పులు లెక్క పెట్టాంటే దాదాపు గంట పడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement