Saturday, November 23, 2024

తెలంగాణ‌లో కొత్త‌గా 2,261 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,261 కరోనా కేసులు నమోదయి. కొవిడ్​తో మరో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి 3,043 మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణలో పాజిటివిటీ రేటు 2 శాతంగా ఉందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు.  రిక‌వ‌రీ రేటు 99.5 శాతంగా ఉంద‌న్నారు. బెడ్ ఆక్యుపెన్సీ రేటు 26 శాతం మాత్ర‌మే ఉంద‌న్నారు. రాష్ట్రంలో 55 వేలకు పైగా పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆస్పత్రుల్లో 14 వేలకు పైగా పడకలు, 7,018 ఐసీయూ బెడ్స్ ఖాళీగా ఉన్నాయని డీహెచ్ వివరించారు.  

ఇక, రెండో విడతలో 87,49,549 ఇళ్లలో సర్వే పూర్తి చేశామని డీహెచ్​ వెల్లడించారు. సర్వేలో 4,037 మందికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించామన్నారు. కొన్నిచోట్ల మూడో దశ ఇంటింటి సర్వే చేస్తున్నామని  చెప్పారు. లక్షణాలు ఉన్న 3.5లక్షల మందిని ఫీవర్​ సర్వేలో గుర్తించామన్నారు. ప్రభుత్వ నిబంధనల పాటించని 114 ఆస్పత్రులపై ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై విచారించి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.   

ఆస్ప‌త్రుల్లో చేరే వారి సంఖ్య పూర్తిగా త‌గ్గిపోయింద‌న్నారు. గ్రామాల్లోనూ ప‌క‌డ్బందీగా లాక్‌డౌన్ అమ‌లు కావాల‌న్నారు. గ్రామాల్లో క‌రోనా కేసుల తీవ్ర‌త త‌గ్గించేందుకు ఐసోలేష‌న్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. ప్రజలకు కరోనాపై అధికారులతో అవగాహన కల్పిస్తున్నామని… కరోనా కేసులు తగ్గితే లాక్‌డౌన్‌ నుంచి వెసులుబాటు లభించే అవకాశం లభిస్తుందని శ్రీనివాస్ రావు చెప్పారు.

ఇది కూడా చదవండి: మొబైల్‌ ఐసీయూ బస్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement