తెలంగాణసీఎం పై ఖర్గే మంగళవారం ఉదయం ఓ క్లారిటీ ఇచ్చారు. సీఎం పదవికి సీనియర్లు పోటీ పడుతుండటంతో.. కాంగ్రెస్ పార్టీలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ పరిశీలకులు.. సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగిస్తూ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని వారు ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నివేదించారు.
ఈరోజే సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తామని, సాయంత్రం లోపు సీఎం అభ్యర్థి పేరు ప్రకటిస్తామని ఖర్గే క్లారిటీ ఇచ్చారు. తెలంగాణకు పంపిన పార్టీ పరిశీలకుల నివేదికను పరిశీలించి.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నేతలతో చర్చించిన అనంతరం సీఎం పేరును ప్రకటిస్తామని చెప్పారు.