Friday, November 22, 2024

Telangana: కేబినెట్ భేటీకి సీఈసీ గ్రీన్ సిగ్నల్

తెలంగాణ కేబినెట్ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షరతులు విధించింది. అత్యవసరమైన విషయాలు, తక్షణం అమలు చేయాల్సినటువంటి అంశాల ఎజెండాపైనే కేబినెట్ చర్చించాలని సీఈసీ షరతులు పెట్టింది.

- Advertisement -

జూన్ 4వ తేదీ లోపు చేపట్టాల్సినటువంటి అత్యవసర అంశాలు ఆ తేదీ వరకు వేచి ఉండటానికి అవకాశం లేని అంశాలను మాత్రమే చేపట్టాలని కండిషన్ పెట్టింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్ని కల సంఘం షరతులు విధించింది.

ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు అయిన అధికారి ఎవరూ కేబినెట్ సమావేశానికి హాజరు కావద్దని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నెల 18వ తేదీన శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్ణయించారు. కానీ సీఈసీ అనుమతి లభించకపోవడంతో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా షరతులు విధించి కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement