Tuesday, November 19, 2024

Telangana – విప్ల‌వాత్మ‌క ప్రోగ్రామ్‌ .. కుల గ‌ణ‌న‌ సర్వే: డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

స‌మాచారం అంతా ఒకేద‌గ్గ‌ర నిక్షిప్తం
భ‌విష్య‌త్తు ప్రణాళిక‌ల‌కు ఇదే కీల‌కం
డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : కుల గ‌ణ‌న కార్య‌క్ర‌మం విప్ల‌వాత్మ‌క కార్య‌క్ర‌మ‌మ‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సమాజంలో అనేక అంశాలపై ఇంటింటి సర్వే నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సామాజిక న్యాయం కోసం ప్రయత్నంలో భాగంగా ఈ స‌ర్వే జ‌రుగుతుంద‌న్నారు.

- Advertisement -

స‌మాచారం నిక్షిప్తం
డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక, రాజకీయ, కుల, మత, విద్యా, వ్యవసాయం ఇలా అనేక అంశాలపై సమాచార సేకరణను భవిష్యత్తులో ఉపయోగపడేలా సమాచారం నిక్షిప్తంగా ఉంటుంద‌న్నారు. తెలంగాణప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం దేశానికి మార్గదర్శిగా ఉంటుంద‌న్నారు.

భ‌విష్య‌త్తు ప్రణాళిక‌ల‌కు దోహ‌దం
రాహుల్ సూచ‌న మేర‌కు నిర్వ‌హిస్తున్న ఈ స‌ర్వే.. భ‌విష్య‌త్తులో అనేక ప్ర‌ణాళిక‌ల‌కు దోహ‌ద‌ప‌డుతుంద‌ని భ‌ట్టి అన్నారు. స‌ర్వేకు స‌హ‌క‌రించాల‌ని ప్రగతిశీల నాయకులకు ఆయ‌న‌ విజ్ఞప్తి చేశారు. సమస్యలు లేకుండా 150 ఇళ్లు మాత్రమే ప్రతి 10 మంది ఎన్యుమారెటర్లకు అప్ప‌గించామ‌న్నారు. అలాగే ఒక పర్యవేక్షణ అధికారికి బాధ్యతలు అప్ప‌గించిన‌ట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement