హైదరాబాద్ – జనవరి నాలుగో తేదిన రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు.. అలాగే మంత్రి వర్గ సభ్యులకు సమాచారం అందించారు.. మంత్రులకు అవసరమైన సమాచారాన్ని అందించాలని అన్ని విభాగాల అధిపతులను కోరారు..
కాగా, రైతు భరోసా, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్ధిక, కొత్త రేషన్ కార్డులు, ఎస్సీ వర్గీకరణ, డెడికేటేడ్ కమిటీ నివేదిక తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.. అలాగే యాదగిరిగుట్ట ఆలయం బోర్డు ఏర్పాటు విషయంలో ఈ భేటిలో నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.
- Advertisement -