Tuesday, November 26, 2024

తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ స‌మావేశం కొనసాగుతోంది. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఈ స‌మావేశానికి మంత్రులు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో అసెంబ్లీ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌పై చ‌ర్చించనున్నారు. దళితబంధు పథకంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. హుజూరాబాద్​తో పాటు మరో నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు అమలుకు ఆమోదముద్ర వేయడంతో పాటు అమలు, లబ్దిదారులకు యూనిట్ల ఎంపికపై చర్చించే అవకాశం ఉంది.

ధాన్యం కొనుగోళ్లు, వరిసాగుపై కూడా చర్చ జరగనుంది. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పిన నేపథ్యంలో ప్రస్తుత పంటకాలం ధాన్యం సేకరణ, యాసంగిలో వరి, ఇతర పంటల సాగుపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఈ అంశంపై అధ్యయనం కోసం ఓ కమిటీని నియామించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, కొవిడ్ వ్యాక్సినేషన్, కొత్త మైనింగ్ పాలసీ సహా ఇతర అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి.  కృష్ణా జలాల విషయంలో అనుసరించాల్సిన వైఖరిపై మంత్రివర్గం చర్చించనునుంది. విద్యుత్తు వివాదం, ఉద్యోగ ఖాళీల గుర్తింపు, నియామకాల నోటిఫికేషన్‌ చర్చకు రానున్నట్టు సమాచారం.

రానున్నఅసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ఐదు ముసాయిదా బిల్లులపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. గృహనిర్మాణ సంస్థ చట్టం, ఉద్యానవన విశ్వవిద్యాలయం చట్టాలను సవరిస్తూ గతంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్​ల స్థానంలో బిల్లులు తీసుకురానున్నారు. పర్యాటకులపై దాడులను నియంత్రించేలా ప్రత్యేక చట్టం కోసం బిల్లు, రిజిస్ట్రేషన్ చట్ట సవరణ పురపాలక, పంచాయతీరాజ్ చట్టాలకు సవరణ బిల్లులపై కూడా చర్చించనున్నారని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్

Advertisement

తాజా వార్తలు

Advertisement