Monday, November 18, 2024

TG: రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ – భ‌ట్టి

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి.. అసెంబ్లీలో బడ్జెట్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు లు ప్ర‌వేశ‌పెట్టారు..

ఈ సంద‌ర్భంగా భ‌ట్టి అసెంబ్లీలో మాట్లాడుతూ… పదేళ్ల అస్తవ్యస్త పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారు.. బంగారు తెలంగాణ చేస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారు.. గత ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు.. గత పదేళ్లలో ప్రభుత్వ అప్పు పది రెట్లు పెరిగింది.. వామనావతారం లెక్క అప్పులు పెరిగాయి.. ఓ వైపు అప్పులు పెరగగా, మరోవైపు బిల్లుల బకాయిలు పేరుకుపోయాయి అంటూ ధ్వ‌జమెత్తారు.

ఇక రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను రూపొందించారు.. రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు.. మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ఉంది.. సాగునీటి పారుదల శాఖకు రూ.26 వేల కోట్లు.. సంక్షేమానికి రూ.40 వేల కోట్లు కేటాయించారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement