హైదరాబాద్ – ప్రతి మండలంలో అధునాతన సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క ప్రకటించారు. కాలేజీ స్థాయిలో ఉద్యోగానికి అవసరమైన మేరకు కోర్సులను ప్రవేశపెట్టి పోటీ ప్రపంచంలో తెలంగాణ విద్యార్థులు నెగ్గుకురాగల సమర్థతను సమకూరుస్తామన్నారు. ఇందులో పైలెట్ ప్రాజెక్టుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు రూ.500 కోట్లు ప్రతిపాదించారు. ఇక విద్యా రంగానికి రూ.21,389 కోట్లు ప్రతిపాదించారు. ఇందులో విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను ప్రోహించేందుకుగాను మౌలిక సదుపాయాల కల్పనకు రూ.500 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యామండలిని ప్రక్షాళనల చేసి హయ్యర్ ఎడ్యుకేషన్‌లో ప్రమాణాలను మెరుగుపరుస్తామని చెప్పారు.
త్వరలో క్యాలెండర్ ..
జ్యాబ్ క్యాలెండర్ ను తయారు చేస్తున్నామని, త్వరలో 15 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నామని తెలిపారు భట్టి .. . అధికారంలోకి వచ్చిన వెంటనే 6,956 నర్సింగ్ ఆఫీసర్లను నియమించామని చెప్పారు. టీఎస్పీఎస్సీకి రూ. 40 కోట్లు కేటాయించామన్నారు.. అలాగే . త్వరలో మెగా డీఎస్సీ ఉంటుందన్నారు.
త్వరలోనే ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం అందిస్తున్నాట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలన్నది మా లక్ష్యం అన్నారు. గురుకుల పాఠశాలల సొసైటీ ద్వారా రెండు ఎంబీఏ కళాశాలల ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు.. నాణ్యమైన విద్య అందించాలన్నదే మా ధ్వేయమన్నారు. రాచరిక ఆనవాళ్లతో ఉన్న రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తామన్నారు. రాజ్యంగ స్పూర్తితో ప్రజాస్వామ్యం, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కొత్త చిహ్నం ఏర్పాట్లు చేస్తున్నాట్లు తెలిపారు.
ధరణి ప్రక్షాళనకు కమిటీ ఏర్పాటు ..
వాహన రిజిస్ట్రేషన్ కోడ్ ను టీఎస్ నుంచి టీజీగా మార్పు చేశామన్నారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు సత్వర చర్యలు తీసుకున్నాం.. ధరణి పోర్టల్ పై అధ్యయనం చేయడానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ధరణి కొంతమందికి భరణంగా మరికొంత మందికి ఆభరణంగా, చాలా మందికి భారంగా మారిందని తెలిపారు. గత ప్రభుత్వ తప్పులతో ఎంతోమంది సొంత భూమిని కూడా అమ్ముకోలేక పోయారని తెలిపారు.
ఇంటి స్థలం ఉంటే రూ.5 లక్షలు సాయం ..
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం అందిస్తున్నాట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలన్నది మా లక్ష్యం అన్నారు. గురుకుల పాఠశాలల సొసైటీ ద్వారా రెండు ఎంబీఏ కళాశాలల ఏర్పాటు చేయబోతున్నాం.. నాణ్యమైన విద్య అందించాలన్నదే మా ధ్వేయమన్నారు.
రాష్రం అధికార చిహ్నాని మారుస్తాం…
రాచరిక ఆనవాళ్లతో ఉన్న రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తామన్నారు. రాజ్యంగ స్పూర్తితో ప్రజాస్వామ్యం, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కొత్త చిహ్నం ఏర్పాట్లు చేస్తున్నాట్లు తెలిపారు. వాహన రిజిస్ట్రేషన్ కోడ్ ను టీఎస్ నుంచి టీజీగా మార్పు చేశామన్నారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు సత్వర చర్యలు తీసుకున్నామన్నారు.. ధరణి పోర్టల్ పై అధ్యయనం చేయడానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ధరణి కొంతమందికి భరణంగా మరికొంత మందికి ఆభరణంగా, చాలా మందికి భారంగా మారిందని తెలిపారు. గత ప్రభుత్వ తప్పులతో ఎంతోమంది సొంత భూమిని కూడా అమ్ముకోలేక పోయారని తెలిపారు.
ఖమ్మం జిల్లాకు అరుదైన గౌరవం… అర్థిక మంత్రిగా భట్టి తొలి బడ్జెట్