Thursday, January 23, 2025

Telangana – కాంగ్రెస్ ఖేల్ కతం … రాష్ట్రంలో వచ్చేది బీజేపీ సర్కారే : ఈటల

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ లో రానుంది బీజేపీ ప్రభుత్వమేనని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మంగ‌ళ‌వారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందంటూ వ్యాఖ్య‌నించారు. అమలుకు సాధ్యం కానీ హమీలను ఇచ్చి హస్తం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఇచ్చిన ఆరు గ్యారంటీ ల్లో ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.

హామీల‌తో మోసం చేసిన కాంగ్రెస్‌
ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చి ప్ర‌జ‌ల‌ను మోసం చేసింద‌ని రాజేంద‌ర్ అన్నారు. తులం బంగారం, ప్రతి మహిళలకు రూ.2,500 వేలు ఇస్తామని చెప్పి ఇవ్వ‌లేద‌ని ఆక్షేపించారు. ఆసరా పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని చెప్పి కాంగ్రెస్ నాయ‌కులు మొండి చేయి చూపించారని మండిప‌డ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో శూన్య హస్తమే మిగిలిందని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పి మోసం చేశారని తెలిపారు. ఇలా అన్ని హమీలను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విస్మరించిందని.. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తూనే ఉన్నారని హెచ్చరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కష్టపడి పని చేసి పార్టీని నిలబెట్టాలని ఈటల పిలుపునిచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement