Friday, November 22, 2024

తెలంగాణ‌ బిజెపిలో సంస్థాగ‌త మార్పులు?

నేతల పనితీరు, సామర్థ్యంపై అధినాయకత్వం ఆరా
పనితీరు మెరుగు పరుచుకోవాలని నేతలకు సునిల్‌ భన్సల్‌ హెచ్చరిక
జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సమావేశాల అనంతరం మార్పులు, చేర్పులు?
ఈ నెలలోనే జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ :రాష్ట్రంలో అధి కా రం రావడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందుకు తగ్గట్టుగా పార్టీలో సంస్థాగత మార్పులను చేపట్ట నున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. పార్టీని క్షేత్ర స్థాయిలో పటిష్ట పరచకుండా విజయం సాధిం చడం కష్టమని భావిస్తున్న బీజేపీ అధిష్టానం ఆ దిశగా పార్టీలోని వివిధ స్థాయిల్లో నాయకత్వ మా ర్పు చేపట్టబోతున్నట్లు సమాచారం. లీడర్‌ కేంద్రం గా కాదు… పార్టీ కేంద్రంగా పని చేయాలని నేతలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునిల్‌ భన్సల్‌ సూచించడం చూస్తుంటే రాబోయే కొద్ది రోజుల్లో పార్టీలో సంస్థాగత మార్పులు తప్పవన్న విషయం స్పష్టమవుతోందని నేతలు చర్చించుకుంటున్నారు. తెలంగాణలోని 17 పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో సునిల్‌ భన్సల్‌ బుధవారం ప్రత్యే కంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నేతల పనితీరుపై ఆయన స్పష్టమైన మార్గనిర్దేశనం చేసినట్లు తెలుస్తోంది. పనితీరు బాగాలేకపోతే వేటు తప్పదన్న హెచ్చరికను సైతం ఆయన జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల చివరివారంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల కార్యవర్గాల సమా వేశాలు జరగనున్న నేపథ్యంలో సునిల్‌ భన్సల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

రాష్ట్ర స్థాయి మొదలు, జిల్లా, మండల స్థాయి వరకు నేతల బలబలాలు, పనితీరును పార్టీ అధినా యకత్వం నిశితంగా గమనిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేతలకు ప్రజల్లో ఉన్న అభిమానం, పార్టీ బలోపేతం కోసం వారు చేస్తున్న కృషి, ఓటర్ల లో ఉన్న పలుకుబడి ఆధారంగా మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు కనిపిసు ్తన్నాయని పార్టీ సీనియర్‌ నేతలు చెబుతున్నారు. పార్టీని బూత్‌, క్షేత్ర స్థాయిలో బలొపే తం చేయ కు ండా అధి కా రం దక్కించు కొ వడం కల్ల అ ని బీజేపీ అగ్ర నా యకత్వం సీరి య స్‌గా భావి స్తున్న ట్లు సమా చారం. రాష్ట్ర వ్యా ప్తంగా వివిధ జి ల్లాల్లో ఉన్న పార్టీ నేతల బలా బ లాల ను పార్టీ అధినాయక త్వం రహస్యంగా బేరీ జు వేస్తున్నట్లు బీజేపీ నేతల్లో అంతర్గతంగా చర్చ జరుగు తోం ది. ఇందుకు బీజేపీ జాతీ య నాయ కత్వం జిల్లాలు, నియోజకవర్గాల వారీ గా నేతల పని తీరుపై రహ స్యంగా సర్వే కొనసాగు తున్నట్లు పార్టీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. ఈ నేప థ్యంలో నియో జకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను విజ యవంతం చేయడంపై నేతలు దృష్టిసారిం చారు. ఈ నెల 16, 17 తేదీల్లో ఢిల్లిdలో బీజేపీ జాతీ య కార్యవర్గ సమా వేశాలు ముగిసిన అనంతరం రాష్ట్రంలో పార్టీ సంస్థాగత పదవుల పునవ్య వసీ ్తకరణ చోటు చేసుకొ నుందనే చర్చ జోరుగా సాగు తోంది. ఈ నెలాఖ రున జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశాలు కని పిస్తున్నాయి. ఈ సమా వేశాల్లోనే ఎన్నికల్లో విజ యం సాధించా లంటే పార్టీ గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీల్లో చేయా ల్సిన మార్పులు, చేర్పులపై నేతలకు అధి నాయ కత్వం స్పష్టమైన దిశానిర్దేశం చేసే అవ కాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలాఖరున ప్రారం భించి కొనసాగించే 10వేల స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశాలు జిల్లా, నియోజకవర్గ, రాష్ట్రస్థాయి నేతలకు పరీక్షగా మారనున్నాయి. ఈ సమా వేశాలను సమ ర్థంగా నిర్వహించి విజయవంతం చేయడం తోపాటు ఆయా ప్రాంతాల్లో పార్టీని క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లిన నేతలకే ముఖ్య పదవులు దక్కు నున్నాయని పార్టీ నేతలు భావి స్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయ డంలో నేతలు విఫలమైతే పార్టీలోని ఇతర నేతలకు సారథ్య బాధ్య తలు అప్పగించడం, అదీ కుదరకపోతే ఇతర పార్టీ ల్లో అసంతృప్త నేతలను పార్టీలోకి ఆహ్వానించి వారికి కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement