హైదరాబాద్ – నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆరంభం కానున్నాయి. ఈరోజు ఉదయం 10:30 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి అసెంబ్లీలో తొలిరోజు 5 కీలక బిల్లులతో పాటు 2 నివేదికలను సభలో ప్రవేశ పెట్టనున్నారు
బిల్లులను ప్రవేశపెట్టిన అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన తదితర అంశాలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు