Monday, November 25, 2024

Telangana Assembly – ఏడో రోజూ సభాకార్యక్రమాలు – ప్రత్యక్ష్య ప్రసారం

YouTube video

హైదరాబాద్: నేడు ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమ్యాయి. నేడు కూడా ప్రశ్నోత్తరాల కార్యక్రమం రద్దు చేశారు..ఇక నేడు . సభ ముందుకు దవ్య వినిమయ బిల్లు రానుంది. చర్చ అనంతరం బిల్లును శాసనసభ ఆమోదించనుంది. 2024 -25 ఆర్థిక సంవత్సరానికి గాను 2,91,159 కోట్లను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ద్రవ్య వినిమయ బిల్లుపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చర్చను మొదలు పెట్టనున్నారు.

కాగా.. సోమవారం తెలంగాణ అసెంబ్లీ రికార్డులు బద్దలు కొట్టింది. ఒకే రోజు 17 గంటల 20 నిమిషాల పాటు అసెంబ్లీలో చర్చ జరిగింది. బడ్జెట్‌ పద్దులపై చర్చ జరిగే క్రమంలో.. సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైంది. 19 పద్దులపై చర్చ జరిగింది.

అధికార, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడారు. వాయిదాలు, వాకౌట్‌లు, నిరసనలు లేకుండా సభ నిరవధికంగా జరిగింది. సోమవారం ఉదయం మొదలైన సభ.. మంగళవారం తెల్లవారు జామున 3.20 గంటల వరకూ కొనసాగింది. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అత్యధికంగా 12 గంటల పాటు సభ జరిగింది. ఆ రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ నిన్న ఏకంగా 17 గంటల పైన సభ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. నిన్న కూడా శాసన సభలో ప్రశోత్తారాలపై చర్చను సభాపతి రద్దు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement