Monday, November 18, 2024

నేడు హరితహారంపై స్వల్పకాలిక చర్చ

అసెంబ్లీ వర్షా‌కాల సమా‌వే‌శాలు శుక్రవారం తిరిగి ప్రారంభం కాను‌న్నాయి. గులాబ్‌ తుఫాను కారణంగా మూడు రోజులపాటు వాయిదా పడిన అసెంబ్లీ ఈ రోజు పునఃప్రారంభం కానుంది. నేడు హరితహారంపై శాసన సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. అలాగే, పరిశ్రమలు, ఐటీ రంగం పురోగతిపై మండలిలో చర్చించనున్నారు. పర్యాటకులు, ప్రయాణికులకు వేధింపులు, మోసాలు నిరోధించేలా రూపొందించిన కొత్త చట్టం టౌటింగ్‌ బిల్లు, జీఎస్టీ చట్టసవరణ బిల్లును ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. గృహనిర్మాణ సంస్థ, ఉద్యానవన వర్సిటీ చట్టసవరణ బిల్లుపై, నల్సార్‌, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లులపై అసెంబ్లీలో చర్చ జరగనుంది.

కాగా, తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్‌ 24న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 5 వరకు సమావేశాలు కొనసాగుతాయి. ప్రస్తుత షెడ్యూలు ప్రకారం శుక్రవారం ఒక్క రోజు సమావేశాలు జరిగి మళ్లీ 4వ తేదీకి వాయిదా పడతాయి. 4, 5 తేదీల్లో మరో రెండు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) నిర్ణయించిన తాత్కాలిక గడువు ప్రకారం అక్టోబర్ 5 వరకు సమావేశాలను నిర్వహించాల్సి ఉంది. అయితే, సమావేశాలను ఎక్కువ రోజులు నిర్వహించాలని సెప్టెంబరు 24న జరిగిన బీఏసీ సమావేశంలో విపక్షాలు డిమాండ్‌ చేశాయి. కనీసం 21 పని దినాలను నిర్ణయించాలని కోరాయి. దీంతో సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో 5న శాసనసభ వాయిదా పడగానే బీఏసీ భేటీ అయి.. సమావేశాల గడువును పెంచే అవకాశాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: హుజూరాబాద్ ఉప ఎన్నిక: టిఆర్ఎస్ అభ్యర్థికి బి ఫాం ఇచ్చిన కేసీఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement