హైదరాబాద్ – తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి మొదలుకానున్నాయి. సమావేశాల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభ నిర్వహణపై ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు ఉభయసభలు మొదలవుతాయి. శాసనసభలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాపం ప్రకటిస్తూ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు…
ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. అనంతరం జరిగే శాసనసభ సలహా మండలి సమావేశంలో సభలో చర్చించాల్సిన అంశాలు, సభను ఎన్ని రోజులు నడుపాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటారు. స్పీకర్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు పాల్గొంటారు.