తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా చేపల పెంపకానికి ప్రోత్సాహం, కొత్త ఆహారభద్రతా కార్డుల జారీ, అర్బన్ మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి – షాదీముబారక్, ఆర్టీసీ కార్గో సేవలపై చర్చించారు. పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ ముగిసిన అనంతరం స్టాంప్ డ్యూటీ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడారు. అనంతరం సీఎం కేసీఆర్ పల్లె ప్రగతిపై, మంత్రి కేటీఆర్ పట్టణ ప్రగతిపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: ఊరికి ఒక పంచాయతీ.. గ్రామానికి రూ.5 లక్షల ఆదాయం: సీఎం