Friday, November 22, 2024

Telangana Assembly ఆర్టీసీపై గ‌రం గ‌రం చ‌ర్చ‌ .. హ‌రీశ్ కు రేవంత్ కౌంట‌ర్ …

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – అసెంబ్లీలో ఆర్టీసీ అంశంపై హాట్ హాట్ గా డిస్కషన్ జరిగింది. కార్మికుల యూనియన్ పునరుద్ధరణ, పీఆర్సీ బకాయిలు, ఆర్టీసీలో ఖాళీలపై మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ఎప్పుడు పూర్తి చేస్తారు ? అపాయింట్‌మెంట్‌ డేట్‌ని ఎప్పుడు ప్రకటిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్‌ అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీపై అడిగిన ప్రశ్నలకు మంత్రి ఇచ్చిన సమాధానాలు ఒకరకంగా చెప్పాలంటే బాధ్యతా రహితంగా, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. జాప్యం జరగడానికి గల కారణాలు ఏంటీ? అన్నప్పుడు లేదండీ అన్నారని తెలిపారు.

దీనిపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతుండగా బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం చెప్పారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కల్గజేసుకుని కార్మికుల పట్ల పోరాడే కమ్యూనిస్టులకు మైక్ ఇస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు.

- Advertisement -

ఆర్టీసీని అన్ని విధాలుగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్టీసీ కార్మికులు 50 రోజులు సమ్మె చేసినప్పుడు బీఆర్ఎస్ నేతలకు సోయి లేదా? అని ప్రశ్నించారు సీఎం రేవంత్. ఎన్నికల ముందు ఆదరబాదరగా ప్రభుత్వంలో విలీనం చేశారని మండిపడ్డారు. హరీశ్ రావు 2014 నుంచి మంత్రిగా పనిచేశారని తెలిపారు . కార్మిక సంఘాలను రద్దు చేసిందే బీఆర్ఎస్ అని చెప్పారు. హరీశ్ రావు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కార్మిక సంఘాలు దీక్షలు చేసినప్పుడు బీఆర్ఎస్ వివక్ష చూపిందన్నారు. ఆనాడు ఆర్టీసీ గౌరవ అద్యక్షుడు హరీశ్ రావేనని చెప్పారు.

అంత‌కు ముందు మంత్రి పొన్నం మాట్లాడుతూ, 10 ఏళ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్టీసీని చంపేసింద‌న్నారు. కార్మిక సంఘాలను రద్దు చేయాలన్నవారే యూనియన్లను పునరుద్ధరించాలని అంటున్నార‌ని ఫైర్ అయ్యారు. హరీష్‌ వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. . 50 రోజులు కార్మికులు సమ్మె చేస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేద‌ని కెసిఆర్ పై మండిప‌డ్డారు. తాము వ‌చ్చిన త‌ర్వాత ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement