తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. రూ.2,75,891 లక్షల కోట్ల ప్రతిపాదనలతో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు, మూల ధన వ్యయం రూ.29,669 కోట్లుగా బడ్జెట్లో పొందుపరిచారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. మార్పును కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించకున్నారని..ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ రూపొందించామన్నారు. తెలంగాణ త్యాగమూర్తులు ఏ ఆశయాలతో ఆత్మారణ చేశారో వాటిని ఆచరణలోకి తీసుకొస్తామన్నారు. శాసన మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ సమర్పించారు.
- Advertisement -