Friday, October 18, 2024

TG : విద్వేషాల బజార్‌గా తెలంగాణ… బండి సంజయ్

  • గ్రూప్ -1 అభ్యర్దుల అరెస్ట్ పై బండి అగ్రహం
  • నిరుద్యోగులను కొట్టడం అమానుష చర్యే
  • జీవో 29పై కాంగ్రెస్ స్టాండ్ ఏమిటో చెప్పాలని డిమాండ్
  • చర్చల ద్వారా పరిష్కరించకుండా ఈ అణచివేత ఏమిటి
  • రేవంత్ చర్యలను తప్పు పట్టిన కేంద్ర మంత్రి


హైదరాబాద్ ‍- గ్రూప్ -1 కోసం శిక్షణ పొందుతున్న యువతులను రాత్రి సమయంలో అరెస్ట్ చేయడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పపట్టారు.. రాత్రిపూట యువతులను అరెస్టు చేయడానికి మీకు ఎంత ధైర్యం అని రేవంత్ ను ప్రశ్నించారు. ఈ మేర‌కు ఆయ‌న ఇవాళ ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిపోతుందన్నారు. నిరుద్యోగులను అమానవీయంగా లాగడం, కొట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ మొహబ్బత్ కి దుకాన్ అంటూ వాగ్దానం చేశాడు.. కానీ తెలంగాణ విద్వేషాల బజార్‌గా మారుతోందని మండిపడ్డారు.

కోర్టు తీర్పు వ్య‌తిరేకంగా వ‌స్తే…
జీవో 29పై కాంగ్రెస్ స్టాండ్ ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్టు మీకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే పరీక్షను మళ్లీ నిర్వహిస్తారా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సింది పోయి బలవంతంగా గొంతు నొక్కుతోందన్నారు. ఇది మంచి పద్ధతి కాదని అంటూ ఇప్ప‌టికైనా గ్రూప్-1 అభ్య‌ర్ధుల స‌మ‌స్య‌ను పరిష్క‌రించే దిశగా అడుగులు వేయాల‌ని రేవంత్ స‌ర్కార్ కు సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement