తెలంగాణ అమర్‌నాథ్ యాత్రగా పేరొందిన సలేశ్వరం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. చుట్టూ అడవి.. కొండలు.. కోనలు.. జలపాతాలు.. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలసిన లింగమయ్య దర్శమిస్తారు.
ఈ నెల 24వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతించనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ జాతర తెలంగాణ అమరనాథ్ యాత్రగా ప్రత్యేక గుర్తింపు పొందిందని, ఏటా మూడురోజులు మాత్రమే ఇక్కడ జాతర జరుగుతుందని తెలిపారు. భక్తులు కిలోమీటర్ల మేర కాలినడకన కొండలు, గుట్టలు దాటుకుంటూ సలేశ్వరం గుడివద్దకు సాహసయాత్ర చేయాల్సి ఉంటుంది.