Wednesday, November 20, 2024

Telangana – ర‌వాణ శాఖ ఆఫీసుల‌పై అటాక్ – మారు వేషంలో ఏసీబీ రెయిడ్‌


ఏసీబీ దూకుడు పెంచింది. మంగ‌ళ‌వారం తెలంగాణ‌ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు లంచం తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టారు. తెలంగాణవ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. మారువేషంలో వెళ్లి అవినీతి భరతం పడుతున్నారు అధికారులు

వంద రూపాయ‌ల నుంచి వ‌సూళ్లు..

- Advertisement -

తాజాగా లారీ డ్రైవర్లుగా అశ్వారావుపేట చెక్‌పోస్ట్‌కు వెళ్లారు అధికారులు. ఏసీబీ అధికారులను లంచం డిమాండ్ చేశారు ఆర్టీఏ చెక్ పోస్టు అధికారులు. ఒక్కో వాహనానికి అనధికారికంగా రూ.100 వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణ, ఏపీ సరిహద్దు చెక్‌పోస్టు కావడంతో అధికారుల చేతివాటం చూపిస్తున్నారు. ఏసీబీ సీక్రెట్ ఆపరేషన్‌లో బాగోతం బయటపడింది. ఇక రంగారెడ్డి, అదిలాబాద్ తో పాటు న‌ల్గొండ‌, మెద‌క్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్ల‌లో సైతం ఎసిబి అధికారులు సోదాలు నిర్వ‌హించారు.. ఈ సోదాల‌లో భారీగా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు గుర్తించారు.. అలాగే ప‌లు చెక్ పోస్ట్ ల‌లో లెక్క‌ల‌లోకి రాని న‌గ‌దు కూడా స్వాధీనం చేసుకున్నారు.. దీనిపై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement