Friday, November 22, 2024

Telangana – రుణమాఫీపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల్సిందే…

ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన హరీశ్​రావు
ఎంత మందికి ప‌థ‌కం అమ‌లు చేశారో చెప్పండి
ల‌బ్ధిదారుల సంఖ్య ఎందుకు త‌గ్గించారు
సంపూర్ణంగా రుణ‌మాఫీ చేయాలంటే దాడులా?
తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాజీ మంత్రి హ‌రీశ్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి ఆ పథకం కింద అర్హులైన రైతులు ఎందరు? ఎంతమందికి అందించారో వెల్లడించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో 36 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామన్న ఆయన కాంగ్రెస్​ 26 లక్షల మందికైనా మాఫీ చేయలేదని విమర్శించారు. శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ విష‌యంలో సంపూర్ణంగా చేశామ‌ని వారు చెప్ప‌గ‌ల‌రా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.

సంపూర్ణంగా రుణ‌మాఫీ చేయాలి..
రుణమాఫీ సంపూర్ణంగా చేయమని అడిగితే తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్​ హయాంలో జూన్, జులైలోనే రైతుబంధు డబ్బులు అందించామని తెలిపారు. ప్రభుత్వం రుణమాఫీపై శ్వేత పత్రం విడుదల చేయాలని హరీశ్ డిమాండ్ చేశారు. రేవంత్​రెడ్డి ప్రభుత్వ పాలనలో వైఫల్యం చెందారని విమర్శించారు. రుణమాఫీ చేయకుండా చేతులెత్తేసిన రేవంత్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వ్యవహారం రుణమాఫీలో కోత మాటల్లో రోతలా ఉందని విమర్శించారు.

ల‌బ్ధిదారుల సంఖ్య ఎందుకు త‌గ్గింది..

- Advertisement -

రూ.31వేల కోట్ల రుణమాపీ ఉందని చెప్పి రూ.18 వేల కోట్లు మాత్రమే చేశారని హరీశ్​రావు దుయ్యబట్టారు. 54 శాతం మందికి మాఫీ చేయలేదని ఆరోపించారు. ఏరకంగా రుణమాఫీ చేశామని రేవంత్ చెబుతున్నారని ప్రశ్నించారు. 47 లక్షల రైతుల మాఫీకి అర్హులని కేబినెట్​లో చెప్పారన్నారు. 27 లక్షల మంది రైతులకు రూ.17 వేల కోట్లతో రుణమాఫీ చేశారన్నారు. లక్షల రుణమాఫీ చేస్తేనే 36 మందికి వచ్చింది రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది ఉంటారా అని ప్రశ్నించారు. రుణమాఫీ లబ్దిదారుల సంఖ్య ఎలా తగ్గిందన్నారు.

మాట త‌ప్పితే రైతులే నిల‌దీస్తారు..

రుణమాఫీ పూర్తిగా చేశానని రేవంత్ అనుకుంటే రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా వెళ్లి రుణమాఫీ గురించి రైతులను అడుగుదాం అన్నారు. మాట తప్పిన చరిత్ర సీఎం రేవంత్​ది అని హరీశ్​ రావు విమర్శించారు. తన చరిత్ర, రేవంత్ రెడ్డి చరిత్రేంటో ప్రజలకు తెలుసన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement