Thursday, December 12, 2024

Telanagana – టీ షర్టులతో లొల్లి – కెసిఆర్… మీ పిల్లలకు మర్యాద నేర్పించు – మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్ – కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేకుంటే మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. .అసెంబ్లీ శీతకాల సమావేశాలలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ రోజున ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి. “కేసీఆర్.. మీ పిల్లలకు మర్యాద నేర్పించు. రోడ్లమీద టీ షర్టులతో లొల్లి పెడుతున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ బయట పిచ్చి వేషాలు వేస్తున్నారని.. తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభం కార్యక్రమంలో ప్రతిపక్షాలు తమ పాత్ర పోషించాలన్నారు.

ఈరోజు తెలంగాణ ప్రకటించిన సోనియమ్మకు శుభాకాంక్షలు తెలిపాల్సింది పోయి.. బయట నినాదాలు చేయడం సరైంది కాదన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో అసలు తెలంగాణ పదమే లేదని మంత్రి అన్నారు.

- Advertisement -

తెలంగాణ తల్లి అంటే దేవతలా కాదు- మన ఇంట్లో అమ్మలా ఉండాలని తెలిపారు. తెలంగాణ తల్లి రూపంపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌ కు లేదని మంత్రి కోమటి రెడ్డి అన్నారు. తెలంగాణ రాదనుకున్న సమయంలో నాలుగుకోట్లు మంది ప్రజల ఆకాంక్ష నెరవేర్చి తల్లి సోనియా గాంధీ అన్నారు. తెలంగాణ ఇచ్చిన దేవతకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈరోజు చరిత్రలో నిలిచి పోయిన రోజు అన్నారు. మా ముద్దు బిడ్డ శ్రీకాంతాచారి ఎల్బీనగర్‌ చౌరస్తాలో కాల్చుకుని జై తెలంగాణ అనే నినాదంతో నాలుగు రోజులు మృత్యువుతో పోరాటం చేసి మృతి చెందాడని అసెంబ్లీలో గుర్తు చేసుకున్నారు.

ఇవాళ చరిత్రలో నిలిచిపోయే రోజు.. మన ఆస్తిత్వనికి ప్రతికలైన వ్యవసాయం చేసుకునే తల్లిని ఇవ్వాల తెలంగాణ తల్లి రూపంలో గౌరవించుకునే సందర్బం అని మంత్రి అన్నారు. నాకు తెలంగాణ అంటే ఎక్కడ లేని అభిమానం అందుకే 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశా అన్నారు. 3 సంవత్సరాలు మంత్రి పదవిని అనుభవించే అవకాశం ఉన్న రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ అటు వైపు చూడలే అన్నారు. మిలియన్ మార్చ్ లో రబ్బర్ బుల్లెట్స్ తగిలినా వెనక్కి తగ్గలేదన్నారు.

ఇన్ని చేసిన తర్వాత కూడా రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడమే కాదు.. మన తల్లిలాంటి తల్లి లేకుండా కిరీటాలతో, వజ్ర వైడుర్యాలతో ఉన్న తల్లిని తీస్తారా అని కామెంట్స్ బాధాకరం అన్నారు. తెలంగాణ తల్లి అంటే చాకలి ఐలమ్మ లాగో, మన పల్లెటూరి తల్లిలాగో ఉంటుందని భావిస్తే.. ఇదేంటి ఇలా ఉందనిపించిందన్నారు. మన పోరాటాలు, ఉద్యమాలు, శ్రమజీవులకు ప్రతీకలైన వ్యవసాయం చేసుకునే మన తల్లిలాగ ఉండాలని ఇవ్వాల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నూతన తెలంగాణ తల్లిని ఆవిష్కరించిందని తెలిపారు.

తెలంగాణ అంటే ఆత్మగౌరవం, స్వేచ్చా, చైతన్యం.. కానీ, గత పదేండ్లలో జరిగిన సంఘటనలు మనకు మాయని మచ్చల్లా వెంటాడుతున్నయన్నారు. అందుకే, ఇప్పుడు తెలంగాణ అస్థిత్వాన్ని సరైన స్థానంలో నిలబెట్టాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. ఈ క్రమంలోనే మన అస్థిత్వానికి ప్రతీకలు, నిజాయితీకి నిలువుటద్దాలు, కష్టానికి ప్రతిరూపాలైన వ్యవసాయం చేసుకునే స్త్రీమూర్తిని.. పోలిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించామన్నారు.

తెలంగాణ తల్లి నమూన విడుదల చేయగానే.. తలపై కిరీటం లేదు, మెడలో నెక్లెస్ లేదు, వంటికి పట్టుచీర లేదు.. తెలంగాణ అస్థిత్వాన్ని ఆగం చేస్తున్నరని కొందరు కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు.

మన తల్లికి కిరటం లేదు.. మన తల్లికి మెడలో నెక్లేస్ లేదు.. అచ్చ తెలంగాణ మహిళను పోలి ఉంటే ఆస్తిత్వం దెబ్బతిందా? అని ప్రశ్నించారు. కిరీటం లేదని అమ్మను అమ్మ కాదంటమా? ఇదెక్కడి వాదన అని అసెంబ్లీలో కోమటి రెడ్డి మండిపడ్డారు. మంత్రిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకునిగా నేను వాళ్లకు ఒక మాట చెప్పదల్చుకున్న అన్నారు. రాజకీయ ఎదుగుదల కోసం తెలంగాణ పేరు తొలగించుకునే అవకాశవాద పార్టీ కాదు కాంగ్రెస్ అన్నారు. ⁠రాజకీయాల కోసం తెలంగాణను తీసేసి బీఆర్ఎస్ అని పెట్టుకున్నవాళ్లకి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. ఈ రాష్ట్రంలో పార్టీ పేరుకు ముందు తెలంగాణ అని రాసుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement