హైదరాబాద్ : కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారని రేవంత్ రెడ్డి సర్కార్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం చేసింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పొన్నం ప్రభాకర్ పంచనివ్వడం లేదని. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో అధికారులు చెక్కులు పంపిణీ చేయకుండా ఆపుతున్నారని హైకోర్టులో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 27 వరకు చెక్కులు పంపిణీ చేయకుంటే బౌన్స్ అయ్యే ప్రమాదం ఉందని, త్వరగా పంచడానికి అనుమతులు ఇప్పించాలని కౌశిక్ రెడ్డి కోర్టును అభ్యర్థించారు.
ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు చెక్కులను పంపిణీ చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అధికారులను కోర్టు ప్రశ్నించింది. చెక్కుల పంపిణీలో ఎందుకు ఆలస్యమైందో చెప్పాలని అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
- Advertisement -