Friday, November 22, 2024

108 సర్వీసుల నుంచి జీవీకే తొలగింపు!?

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సంస్థ జీవీకేని 108 సర్వీసుల నుంచి తప్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వీటి స్థానంలో కొత్త సంస్థల కోసం టెండర్లే పిలిచే యోచనలో ఉంది.  ఓపెన్ టెండర్లు పిలిచేందుకు వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో అధికారులు విధివిధానాలను ఖరారు చేస్తున్నారు. వాహనాల నిర్వహణలో జీవీకే సంస్థ నిర్లక్ష్యం వహిస్తోందని ఉద్యోగులు, పేషెంట్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో 108 అంబులెన్స్‌లను నిర్వహించేందుకు జీవీకే గతంలో చేసుకున్న ఒప్పందం నాలుగేళ్ల క్రితమే ముగిసింది. అయితే ప్రభుత్వం కొత్త టెండర్లు పిలవకుండా ఆ సంస్థకే రెన్యువల్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో జీవీకే సంస్థ వాహనాలు సక్రమంగా నిర్వహించలేకపోవడంతో పాటు ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వడం లేదు. అలాగే, అంబులెన్స్‌ల నిర్వహణ లోపంతో చాలాచోట్ల వాహనాలు సడెన్‌గా ఆగిపోతున్నాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో 108 సర్వీసుల నిర్వహణకు ఇకపై కొత్త సంస్థలను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp

https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement