ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ జిల్లాలో పలిమెల తహసీల్దార్ పై వేటుపడింది. పలిమెల తహసీల్దార్ సయ్యద్ సర్వర్ 102 ఎకరాల భూమి డెక్కన్ సిమెంట్ కు రిజిస్ట్రేషన్ చేయడంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ విచారణ చేపట్టారు.
శనివారం విచారణ చేపట్టి నివేదికను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు అందజేశారు. దీంతో జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీసీ యల్ ఏ కు సమాచారం అందించారు.
- Advertisement -