కడెం, జనవరి 10, ప్రభ న్యూస్ : నిర్మల్ జిల్లాలోని మండల కేంద్రమైన కడెంలో తహాసిల్దార్ కార్యాలయంలో అదిలాబాద్ ఏసీబీ డిఎస్పి వి.వి. రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. మండలంలోని కొత్త మది పడగా గ్రామానికి చెందిన లాసెట్టి రాజన్నకు చెందిన 35 గుంటల భూమిని పట్టా చేయడానికి కడెం మండల తహసిల్దార్ రాజేశ్వరి రూ.15వేలు లంచం అడగ్గా.. తహసీల్దార్ కు రూ.9వేలు తమ భూమిని పట్టా చెయ్యాలని బాధితుడు కోరారు.
దీంతో బాధితుడు ఆదిలాబాదులోని ఏసీబీ అధికారులకు విషయం గురించి తెలపగా.. బుధవారం తొమ్మిది వేల రూపాయలు బాధితుడు రాజన్న మండల డిప్యూటీ తహసిల్దార్ చిన్నయ్య చేతుల మీదుగా కడెం మండల తహసీల్దార్ రాజేశ్వరికి లంచం డబ్బులు ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. లంచం డబ్బులు తీసుకున్న మండల తహసిల్దార్ రాజేశ్వరి, డిప్యూటీ తహసిల్దార్ చిన్నయ్యను అరెస్టు చేసి ఏసీబీ కోర్టుకు పంపనున్నట్లు అదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ ఎస్ఐలు రవీందర్, జాన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.