ఓ జ్యోతిష్యుడిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన తీన్మార్ మల్లన్న చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది. ” లక్ష్మీకాంత్ శర్మ మీద 17 షోలు వ్యక్తిగతంగా వెంటాడి చేయడం తప్పుచేసినట్టున్నాను ” అని మల్లన్న ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్ మల్లన్ననే చేశారా? లేక ఆయన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ట్వీట్ తాను చేయలేదని, తప్పుడు ప్రచారాలని నమ్మవద్దని మల్లన్న కోరినట్టుగా తెలుస్తోంది.
జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్ శర్మను బెదిరించారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను చిలకలగూడ పోలీసులు శుక్రవారం(ఆగస్ట్ 27) రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శనివారం సికింద్రాబాద్ సివిల్ కోర్టులో ఆయనను హాజరుపరిచారు. మల్లన్న బెయిల్ పిటిషన్ వేయగా.. సెప్టెంబర్ 9వరకు కోర్టు రిమాండ్ విధించింది. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని తనను బెదిరించాడని లక్ష్మీ కాంత్ శర్మ కొద్దిరోజుల క్రితం చిలకలగూడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపారు.
ఇది కూడా చదవండిః చంచల్‌గూడ జైలుకు తీన్మార్ మల్లన్న.. 14 రోజుల రిమాండ్..