తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర రెండో రోజుకు చేరుకుంది. ఇవాళ రెండో రోజు ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభించనున్నారు. మెహిదీ పట్నం, తొలిచౌకి, షేక్ పేట, గోల్కొండ పోర్ట్, లంగర్ హౌస్, బాపు ఘాట్ మీదుగా రెండో రోజు పాదయాత్ర కొనసాగనుంది. ఈ రోజు ఏకంగా 11 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు బండి సంజయ్. ఇక గోల్కొండ పోర్ట్ దగ్గర సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ నిర్వహించనుంది బీజేపీ. ఈ బహిరంగ సభలో బండి సంజయ్ ప్రసంగించనున్నారు. ఇక ఇవాళ రాత్రి శ్యాం ప్రసాద్ ముఖర్జీ ప్రాంగణం బాపు ఘాట్ దగ్గర బండి సంజయ్ బస చేయనున్నారు.
తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతో బండి సంజయ్ పాద యాత్రం చేపట్టారు కాగా ఈ పాదయాత్ర నిన్న చార్మినార్ దగ్గర ప్రారంభం అయింది. చార్మినార్ దగ్గర ప్రారంభమైన ఈ పాదయాత్ర…. అసెంబ్లీ మీదుగా… నిన్న రాత్రి సమయానికి మెహిదీపట్నం కు చేరుకుంది. నిన్న రాత్రి అక్కడే బస చేసిన బండి సంజయ్.
ఇది కూడా చదవండి: బండి పాదయాత్ర ఎందుకు? : మంత్రి శ్రీనివాస్ గౌడ్