Saturday, November 23, 2024

ఎమ్మెల్సీ ప్లీజ్….

6 ఖాళీలు… 60 మంది ఆశావహులు
గుత్తా, కడియం, నేతి విద్యాసాగర్‌, బోడకుంటి, ఫరీదుద్దీన్‌, ఆకుల సుజాతల పదవీకాలం పూర్తి
జూన్‌ 3తో నిర్దేశిత పదవీకాలం పూర్తి
ఎమ్మెల్యే కోటాలో పదవులు
ఒకరిద్దరికే రెన్యువల్‌… మిగతావారికి గండమే
సరికొత్త సమీకరణలపై సీఎం కేసీఆర్‌ దృష్టి
అతి త్వరలో నోటిఫికేషన్‌
హైదరాబాద్‌, : రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్సీ ఖాళీ ల భర్తీకి సంబంధించి అతి త్వరలో నోటిఫికేషన్‌ వెలువడే అవ కాశం ఉందని రాజకీయవర్గాలు భావిస్తు న్నాయి. జూ న్‌ 3తో ఎమ్మెల్యే కోటాలో ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్‌, ఆకుల లలితల పదవీకాలం ముగియనుంది. లెక్క ప్రకారం ఇప్పటికే ఈ ఆరు ఎమ్మెల్సీ ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్‌ రావా ల్సి ఉండగా, ఏ క్షణమైనా నోటిఫికేషన్‌ రావొచ్చని.. వారం లోపే నోటిఫికేషన్‌ వస్తుందని భావిస్తున్నట్లు ఆశావహులు చెబుతున్నారు. కేంద్ర ఎన్నికలసంఘం ఇటీవల సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఖాళీల భర్తీకి, నోటిఫికేషన్ల విడు దలకు తొందరపడకూడదని భావిస్తోంది. ప్రజ లతో ఈ ఎన్నికకు సంబంధం లేదు కాబట్టి.. యథాప్రకారం నోటిఫి కేషన్‌ జారీ అవుతుందా.. లేక కొవిడ్‌ నేపథ్యంలో పదవీకా లం ముగిసిన తర్వాత నోటిఫికే షన్‌ జారీచేస్తుందా అన్న అంశాలపై ఒకటి, రెండురోజుల్లో స్పష్టత వస్తుందని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.పలువురు ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్‌ కుమార్‌, ప్రణాళికాసంఘం ఉపాధ్య క్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌లను ఆశ్రయిస్తున్నారు.
గండం ఎవరికి?
ప్రస్తుతం ఉన్న ఆరుగురిలో ముగ్గురు లేదా నలుగురికి పదవీగండం ఉందని, ఒకరిద్దరికే రెన్యువల్‌ ఛాన్స్‌ ఉందని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డికి రెన్యువల్‌ ఖాయమన్న ప్రచారం ఉంది. నల్లగొండ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ, డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌కు ఇప్పటికే ఒకసారి రెన్యువల్‌ చేసి నందున ఈ సారి రెన్యువల్‌ కు అవకాశం ఉండకపో వొచ్చన్న చర్చ జరుగుతోంది. ఈ జిల్లా నుండి ఎంసి కోటి రెడ్డి పేరు వినబడుతోంది. అయితే గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోటిరెడ్డి ఇద్దరికీ ఒకేసారి పదవులు లభించే అవకాశాలు తక్కువని, ఒకే సామాజికవర్గం.. ఒకే జిల్లాకు అవకాశం అరుదని పార్టీవర్గాలు అంటున్నాయి. ఇక మరో సీనియర్‌ నేత కడియం శ్రీహరి రెన్యువల్‌పై ఉత్కంఠ కొనసాగుతుం ది. వచ్చే అసెంబ్లి, లోక్‌సభ ఎన్నికల్లో ఏదో ఒక అభ్యర్ధిత్వం పై హామీ ఇస్తారా? లేక రెన్యువల్‌ చేసి మండలి ఛైర్మన్‌ లేదా డిప్యూటీ ఛైర్మన్‌గా నియమిస్తారా అన్న అంశాలపై రాను న్నరోజుల్లో స్పష్టత కానుంది. కడియం శ్రీహరి లేదా ఆయ న కుమార్తె కావ్యకు ఏదో ఒక భరోసా ఖాయమన్న చర్చ పార్టీవర్గాల్లో ఉంది. మాజీమంత్రి ఫరీదుద్దీన్‌కు రెన్యువల్‌ అవకాశాలు కొట్టిపారేయలేమంటున్నారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఆకుల సుజాతను రెన్యువల్‌ చేసా ్తరా.. లేక ఆమెకు మరో కార్పోరేషన్‌ పదవిని అప్పగిస్తారా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎమ్మెల్సీకి బదులు మహిళా అభివృద్ది కార్పోరేషన్‌ సంస్థ ఛైర్మన్‌ పదవి లభించవచ్చన్న చర్చ జరుగుతోంది. వరంగల్‌ జిల్లాకు చెందిన చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు రెన్యువల్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. రెన్యువల్‌ సాధ్యంకాకుంటే ఆయన స్థానంలో మాజీ స్పీకర్‌ మధుసూధనాచారికి ఛాన్స్‌ ఉందని చెబుతున్నారు.
ఆశావహులు.. హామీలు
వివిధ ఎన్నికలు, స్థానిక రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని ఆరు ఖాళీలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ భర్తీచేయనున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శుల్లో బండి రమేష్‌ తీవ్రంగా ప్రయత్నిస్తు న్నట్లు తెలిసింది. ప్రస్తుతం మండలిలో కమ్మసామాజికవ ర్గానికి ప్రాతినిధ్యం లేని నేపథ్యంలో సీఎం కూడా సాను కూలంగా ఉంటారన్న ప్రచారం ఉంది. ఇక మహబూబ్‌న గర్‌కు చెందిన క్రీడాప్రాధికార సంస్థ ఛైర్మన్‌ ఎ.వెంకటేశ్వర రెడ్డి ఎమ్మెల్సీ పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. సాగర్‌ ఎన్నికల్లోనూ పనిచేసిన తక్కళ్ళపల్లి రవీందర్‌రావు ఈసారైనా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మాజీ స్పీకర్‌ మధుసూధనాచారికి ఇటీవల హామీ లభించి నట్లు ప్రచారం ఉంది.
అదే జిల్లాకు చెందిన మాజీ ఎంపీ సీతారాంనాయక్‌ కూడా ఆశలు పెట్టుకున్నారు. ఎస్సీ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యదర్శి మాదాడి రమేష్‌రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పా యం వెంకటేశ్వర్లు, సీఎంకు సన్నిహితుడిగా పేరున్న పార్టీ ప్రధానకార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌ రెడ్డి తదితరుల పేర్లు ప్రచారంలో వినబడుతున్నాయి. ఈ ఆరుపదవులతో పాటు జూన్‌ 17న గవర్నర్‌ కోటాలో ఖాళీ కానున్న మరో పదవికి కూడా సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని సీఎం ఎంపిక చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement