ఉపాధ్యాయ బదిలీల్లో సీఎం కేసీఆర్ ఆదేశాలు అమలు కావడం లేదని ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న భార్యాభర్తలను ఒకే చోట పనిచేసేలా చూడాలని స్వయంగా కేసీఆర్ చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. కొత్త జోనల్ విధానంలో తమను కామారెడ్డి జిల్లాకు బదిలీ చేసారని అంటున్నారు. తమకు నిజామాబాద్ జిల్లాకు కేటాయించాలని సుమారు వంద మంది టీచర్లు కలెక్టర్ ను కలిసి కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital