హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఉపాధ్యాయుల పరస్పర బదిలీల జాబి తాలో పలువురి టీచర్ల పేర్లు గల్లంతైనట్లు టీఎస్ యూటీఎఫ్ పేర్కొంది. అండర్ టేకింగ్ పత్రం (అంగీకార పత్రం) ఇచ్చి డీఈవోల ద్వారా పాఠశాల విద్యాశాఖకు ఆయా టీచర్ల జాబితా పంపినప్పటికీ పలువురి పేర్లు ఆ జాబితాలో గల్లంతవడంపై యూటీఎఫ్ మండి పడింది.
జాబితాను సవరించి పూర్తి స్థాయి రెండో జాబితాను వెంటనే విడుదల చేయాలని మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.