Thursday, November 21, 2024

డబ్బు కోసం ఉపాధ్యాయుడు దారుణ హత్య

తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు దారుణ హత్యకు గురయ్యాడు ఓ పాధ్యాయుడు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నరహరి వద్ద జగదీష్ అనే రియల్టర్ పెద్ద మొత్తంలో డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. తీసున్న అప్పు తిరిగి ఇవ్వాలని నరహరి గతకొంత కాలంగా అడుగుతున్నాడు. దీంతో నరహరి హత్యకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

బుధవారం అర్థరాత్రి బగీరధ కాలనీలో బైకుపై వెళుతున్న నరహరిని వెనుకనుంచి కారుతో ఢీకొట్టి, కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. సంఘటన స్థలంలో లభించిన కారు, ఇతర వస్తువులను బట్టి హత్యకు పాల్పడింది జగదీష్ అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement