Friday, October 18, 2024

TATA Mark – అపాచీ చాప‌ర్‌ తయారీ కేంద్రంతో తెలంగాణకు ప్రపంచ ఖ్యాతి..

అపాచీ చాప‌ర్‌ తయారీ కేంద్రం టాటాదే
సాప్ట్ వేర్, మోటార్.. కమ్యూనికేషన్ల పంట
అభివృద్ధి పునాదుల్లో ర‌త‌న్ టాటా
దేశీయ‌, సైనిక విమాన రంగంలోనూ టాటా

ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్ తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో.. అభివృద్ధి పునాదుల్లో రతన్ టాటా పాత్ర ఉంది. ఈ రోజున హైదరాబాద్‌లో సాప్ట్ వేర్ రంగమే కాకుండా, మోటార్, కమ్మూనికేషన్.. కడకు దేశ రక్షణ డిఫెన్స్ రంగంలోని పునాదుల్లోనూ రతన్ టాటా ఇటికలు ఉన్నాయి.దేశీయ పౌర, సైనిక విపణిలోనూ భారతదేశంలో సికోర్స్కీ S-92 హెలికాప్టర్‌ను తయారు చేయడానికి టాటా సికోర్స్కీ ఎయిర్‌ క్రాఫ్ట్ కార్పొరేషన్‌తో సంయుక్త భాగస్మామ్య చరిత్రను రతన్ టాటా సృష్టించారు. 200 మిలియన్ల డాలర్లతో హైదరాబాద్‌లో హెలీకాప్టర్ల తయారీ కర్మాగారాన్ని ప్రారంభించారు.

2010లో తొలి ఎస్ 92 కేబిన్‌ను విడుదల చేసింది. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 36–48 క్యాబిన్‌లకు పెరుగుతుందని అంచనా వేస్తే.. జులై 2013 చివరి నాటికి, 39 క్యాబిన్‌లు రెడీ అయ్యాయి. భారతదేశంలో లాక్‌హీడ్ సీ-130 హెర్క్యులస్, లాక్‌హీడ్ సీ -130జే సూపర్ హెర్క్యులస్ కోసం ఏరో నిర్మాణాలను ఉత్పత్తి చేస్తోంది. ఇది 74:26 జాయింట్ వెంచర్, ప్రస్తుతం హెర్క్యులస్ సెంటర్ వింగ్ బాక్స్‌లు ఎంపెనేజ్‌లను సమీకరించేందుకు డిఫెన్స్, స్పేస్ భాగస్వామ్యంతో, కంపెనీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లైట్-కార్గో ఫ్లీట్ రెన్యూవల్ ప్రోగ్రాం కోసం ఈయాడ్స్ కాసా సీ-295ను రంగంలోకి దించింది, దీన్ని భారత ప్రభుత్వం 13 మే 2015న ఆమోదించింది. ప్రాజెక్ట్ కింద 16 పూర్తి విమానాలు దిగుమతి చేస్తారు. 40 విమానాలు దేశంలో తయారు చేస్తారు.

- Advertisement -

అపాచీ హెలీక్యాప్ట‌ర్ ఉత్ప‌త్తికి..

బోయింగ్ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ హైదరాబాద్‌లో టాటా బోయింగ్ ఏరోస్పేస్ జాయింట్ వెంచర్ కు పునాది వేసింది. బోయింగ్ ఏ హెచ్ -64 అపాచీ హెలికాప్టర్ ఫ్యూజ్‌ లేజ్‌లు, ఇతర ఏరో స్ట్రక్చర్‌లను -ఉత్పత్తికి , ఏరోస్పేస్‌లో ఇంటిగ్రేటెడ్ సిస్టమ్‌ లను కొనసాగిస్తోంది. చివరికి ప్రపంచవ్యాప్తంగా ఏహెచ్ -64 ఫ్యూజ్‌లేజ్‌ల ఏకైక ఉత్పత్తిదారిగా హైదరాబాద్ ఆవతరించింది . అపాచీని యునైటెడ్ స్టేట్స్ , భారతదేశంతో సహా 15 ఇతర దేశాలు అపాచీలపై మక్కువ పెంచుకున్నాయి. బోయింగ్ వాణిజ్య , సైనిక విమానాల కోసం ఏరోస్ట్రక్చర్లను తయారు చేయడానికి బోయింగ్, టాటా గ్రూప్ కంపెనీలు భారతదేశంలో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశాయి. టాటా అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ పవర్, మిషన్ ఎక్విప్‌మెంట్ క్యాబినెట్‌ల కోసం కంపోజిట్ ప్యానెల్‌లను పంపిణీ చేసింది. పీ -8I దీర్ఘ-శ్రేణి సముద్ర నిఘా, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ ఎయిర్‌క్రాఫ్ట్ కోసం సహాయక పవర్ యూనిట్ డోర్ ఫెయిరింగ్‌లను అందించింది. టాటా ఏరో లిమిటె మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ బోయింగ్ 787-9 కోసం కాంప్లెక్స్ ఫ్లోర్ బీమ్‌లను తయారు చేస్తోంది, ఇది అసాధారణమైన పర్యావరణ, ఇంధన సమర్థవంతమైన సామర్థ్యాలతో అత్యంత ఆధునిక విమానంగా చెప్పుకోవ‌చ్చు.

ఆంధ్రా వర్సిటీ.. రిసెర్చ్ పై మక్కువ

రతన్ టాటా ఆంధ్రా యూనివర్సిటీలో ఉమ్మడి పరిశోధనలు జరగాలని రతన్ టాటా సూచనలు చేశారు . విశాఖపట్నంలో ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం సమావేశానికి ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జి. నాగేశ్వరరావుతో కలిసి టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ ఎన్.టాటా పాల్గొన్నారు. ఆంధ్రా యూనివర్సిటీతో కలిసి సంయుక్తంగా పరిశోధనలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని టాటా ట్రస్టుల చైర్మన్ రతన్ ఎన్.టాటా తెలిపారు. 2018లో ముఖ్య అతిథిగా పాల్గొన్న టాటా మాట్లాడుతూ గత తొమ్మిది దశాబ్దాల కాలంలో ఏయూ సాధించిన ఘనతలను విని ఆకట్టుకున్నట్లు చెప్పారు. “సంవత్సరాలుగా విశ్వవిద్యాలయం యొక్క గొప్ప నాయకత్వం దేశానికి దాని సహకారం గురించి విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను” అని అతను చెప్పాడు. అదే సందర్బంగా ఉమ్మడి పరిశోధనలకు కలసి రావాలని ఆంధ్రా యూనివర్సిటీ రిసెర్చ్ వింగ్ ను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement