Tuesday, November 26, 2024

తెలంగాణలో టాటా.. హార్డ‌వేర్ లో అడుగు పెట్టాల‌నే ప్లాన్..

ప్ర‌భ‌న్యూస్: దేశీయ పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌ సెమికండక్టర్ల వ్యాపారంలోకి అడుగు పెట్టబోతోంది. సెమికండక్టర్ల అమరిక, టెస్టింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు 300 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2,250 కోట్లు) పెట్టుబడులు పెట్టాలని దేశీయ దిగ్గజం టాటా గ్రూప్‌ యోచిస్తోంది. ఇందుకోసం మూడు దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలతో టాటా గ్రూపు చర్చలు జరుపుతోంది. ఓఎస్‌ఏటీ(ఔట్‌సోర్స్‌డ్‌ సెమికండక్టర్‌ అసెంబ్లి అండ్‌ టెస్ట్‌) ప్లాంట్‌ ఏర్పాటుకు స్థలం కోసం టాటా గ్రూప్‌ అన్వేషిస్తోందని ఈ అంశంపై అవగాహన ఉన్న వర్గాలు వెల్లడించాయి. సెమికండక్టర్‌ వ్యాపారానికి సంబంధించి మొదటి వార్త ఇదేకావడం గమనార్హం. కాగా ఓఎస్‌ఏటీ ఫ్లాంట్‌ ప్యాకేజింగ్‌, అమరికతోపాటు ఫౌండ్రీలో తయారైన సిలికాన్‌ వాఫెర్స్‌ను పరీక్షిస్తుంది. సెమికండర్‌ చిప్‌లు సిద్ధం చేస్తుంది.

అయితే ఫ్యాక్టరీ కోసం సమర్థవంతమైన ప్రాంతాన్ని ఎంచుకోవాలని టాటా గ్రూప్‌ భావిస్తోందని ఓ ప్రతినిధి పేర్కొన్నారు. ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది వచ్చే నెలలో ఖరారయ్యే అవకాశం ఉందని అన్నారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో టాటా గ్రూపు ఇప్పటికే చాలా దృఢంగా ఉంది. హార్డ్‌వేర్‌ రంగాన్ని కూడా తమ పోర్ట్‌ఫోలియో చేర్చుకోవాలని ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. హార్డ్‌వేర్‌ రంగంలో దీర్ఘకాల వృద్ధి క్లిష్టమని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ రిపోర్టులపై ఇటు టాటా గ్రూప్‌ కానీ.. అటు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ ఇప్పటివరకు స్పందించలేదు. టాటాల ఓఎస్‌ఏటీ బిజినెస్‌లో ప్రభావవంత క్లయింట్ల కంపెనీల జాబితాలో ఇంటెల్‌, అడ్వాన్స్‌డ్‌ మైక్రో డివైజెస్‌(ఏఎండీ), ఎస్‌టీమైక్రోఎలక్ట్రానిక్స్‌ ఉన్నాయి

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement