వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్): వరంగల్ శివారులో పేకాట ఆడుతున్న శిబిరంపై పోలీసులు మెరుపు దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తుండటంతో పేకాటరాయుళ్లు రూట్ మార్చారు. నగరంలోని ఇళ్ల మధ్యే శిబిరం ఏర్పాటు చేసి ఆడటంతో పోలీసుల దృష్టి మళ్లించాలని భావించారు. అంతే మాస్ ఏరియాగా పేరు గాంచిన వరంగల్ నగరంలోని కరీమాబాద్ లోగల ఉమ్మర్ గల్లీలోని ఓ ఇంటినే పేకాట స్థావరంగా మార్చుకొని ఆడుతున్నట్లుగా టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ ఆర్.సంతోష్ కు పక్కా సమాచారం అందుకున్నారు. తన సిబ్బందితో సోమవారం సాయంత్రం పేకాట శిబిరంపై దాడి చేశారు.
పేకాట శిబిరం నిర్వహిస్తున్న నిర్వహకుడితో పాటు, మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. కరీమాబాద్ కు చెందిన నెల్లూట్ల. సతీష్ (43, ఆర్గనైజర్), హన్మకొండ, సుందరయ్యనగర్ కు చెందిన గొడుగు అనిల్, ఎస్ ఆర్ ఆర్ తోటకు చెందిన వేల్పుల స్వామి, సోమ.శివను అరెస్ట్ చేశారు. వారి నుంచి 13, 230 రూపాయల నగదు, 4 మొబైల్ ఫోన్స్, ప్లే కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల కోసం మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించారు.