వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్): వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. ఐపీ ఎల్ క్రికెట్ మ్యాచ్ లు ప్రారంభమైనప్పటి నుంచి ఆన్‌లైన్ బెట్టింగ్స్ పై ఓరుగల్లు పోలీసులు ఫోకస్ పెట్టారు. పోలీసులు ఊహించినట్టే ఆన్ లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న 9 మంది బెట్టింగ్ రాయుళ్లతోపాటు ముగ్గురు సభ్యుల ముఠాను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరి నుండి 5. 55లక్షలతో పాటు, 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో జనగామ జిల్లా ఘన్ పూర్ కు చెందిన పల్లెరాళ్ళ రంజిత్ (30, బుకీ), మంగ శివ (27, బుకీ),
జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఎండి అబ్దుల్ ఫయాజ్ (29, బుకీ) ఉన్నారు.
ఇక మిగిలిన క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు జనగాం జిల్లా ఘనపూర్ ప్రాంతాలకు చెందిన క్రోసూరు అజయ్ కుమార్, మునిగంటి శేకర్, రాజారపు హరీష్, బోల్లు హరికృష్ణ,గోలి అఖిల్, భుక్యాసాయిరాంగా పోలీసులు తెలిపారు. వీరితో పాటు మరో పది మంది నిందితులు పరారీలో ఉన్నారు. వీరిలో సంగా విజయ్, శ్యాంసుందర్, యం.డి ఇంతియాజ్, సాయి వరుణ్,మంగ సాయి, యం.డి అమీర్,ఎన్.దయాకర్,వినోద్ కుమార్, సతీష్ రెడ్డి, యం.లింగరెడ్డి ఉన్నట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి చెప్పారు.