హైదరాబాద్ – ఎమ్మెల్సీ కవితపై బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యాలు చేశారంటూ బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహాంతో రగిలిపోతున్నాయి.. హస్తినలోనూ, తెలంగాణలోనూ బండిపై నిరసనలు కొనసాగుతున్నాయి.. బిఆర్ఎస్ కు చెందిన అమాత్యుల నుంచి సామాన్య కార్యకర్త వరకూ బండి సంజయ్ పై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుల చేస్తున్నారు.. కొన్నిచోట్ల ఎఫ్ఐఆర్ లు కూడా నమోదయ్యాయి.. తెలంగాణ మహిళ కమిషన్ సంజయ్ వ్యాఖ్యాలను సుమోటోగా తీసుకుని సంజాయిషీ ఇవ్వవలసిందిగా ఆదేశించింది.. ఢిల్లీలోని జాతీయ మహిళ కమిషన్లో సైతం బిఆర్ ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు..సంజయ్ పై వ్యతిరేకగళం పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ మాత్రం సంజయ్ కు అండగా నిలిచారు.. బండి మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారంటూ ఒక్క ముక్కలో వివాదానికి ముగించే ప్రయత్నం చేశారు.. కాగా, లిక్కర్ స్కామ్ లో వందల కోట్ల అవినీతి జరిగిందని తరుణ్ చుగ్ ఆరోపించారు. దర్యాప్తు సంస్థలకు సోనియా గాంధీ అయినా, కేసీఆర్ అయిన ఒకటేనని అన్నారు. లిక్కర్ స్కామ్ లో కవిత నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement